ఓటీటీలోకి హిందీ కన్నప్ప!

Friday, December 5, 2025

మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించిన భారీ ప్రాజెక్ట్‌ “కన్నప్ప” గురించి ప్రేక్షకులకు ముందే మంచి బజ్‌ వచ్చింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దక్షిణాది నుండి పలువురు పెద్ద స్టార్‌లు ఒకే తెరపై కనిపించడం మరింత స్పెషల్‌ అయింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు సినిమా సరైన స్థాయిలో కలెక్షన్స్‌ సాధించి డీసెంట్‌ రన్‌ చూపించింది.

అయితే థియేట్రికల్‌ రన్‌ ముగిసిన దాదాపు పది వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట పాన్‌ సౌత్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అందుబాటులోకి వచ్చినా, హిందీ వెర్షన్‌ మాత్రం అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆ గ్యాప్‌ కూడా నింపుతూ హిందీ ఆడియన్స్‌ కోసం కూడా ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ మహాదేవుడి పాత్రలో మెప్పిస్తే, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రుద్ర పాత్రలో అదరగొట్టాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles