పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పెద్ద సినిమా “ఓజి” ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రంపై మొదటి నుంచే ఉన్న అంచనాలు రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూసి ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఇద్దరూ మరింత ఉత్సాహంగా ఉన్నారు.
ఇక రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమా బుకింగ్స్ హవా మొదలైంది. యూఎస్ సహా ఇతర దేశాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, లేటెస్ట్ టాక్ ప్రకారం ఓజి ఇప్పటికే 50 కోట్ల మార్క్ దగ్గరకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అంటే రిలీజ్ కి ముందే ఇంత హైప్ అందుకోవడం ఈ సినిమా కోసం క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
మరి అసలు థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఈ సినిమా రికార్డులను చెరిపేస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బలమైన సపోర్ట్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ మాత్రం దుమ్ము రేపడం ఖాయం అని చెబుతున్నారు.
