టాలీవుడ్‌లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులలో “పెద్ది” సినిమా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రంగస్థలం తరవాత చరణ్ చేస్తున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రాన్ని ఉపరితలంగా చూస్తే ఓ సాధారణ కథలా అనిపించొచ్చు, కానీ దాని వెనక బుచ్చిబాబు సానా స్టైల్ ఉన్నందున కథలో కొత్తదనం ఖచ్చితంగా ఉంటుందని టాక్. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది.
ఇక షూటింగ్ విషయానికి వస్తే, సినిమా పనులు ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. మేకర్స్ ప్లాన్ చేసినంత వేగంగా షూటింగ్ పూర్తవుతూ ఉండటంతో ఇప్పటివరకూ దాదాపు 55 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. గత మార్చిలో సినిమా దాదాపు 30 శాతానికి చేరినప్పటికీ, ఆ తర్వాత చాలా చకచకా జరిగిపోయింది. ఈ గ్యాప్‌లోనే ఇంకొంత భాగం షూటింగ్ ముగించారట.
ఇప్పుడు దృష్టి మొత్తం మిగిలిన కీలక సన్నివేశాలపైనే ఉందని తెలుస్తోంది. జెట్ స్పీడ్‌లో షూటింగ్ సాగుతూ ఉండటంతో సినిమా టైమ్ కి రెడీ అవుతుందన్న నమ్మకం బలపడుతోంది. ఇక మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో ఎఆర్ రెహమాన్ చేతులు కలిపిన విషయం కూడా ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ లో మంచి ఉత్సాహం తీసుకొచ్చింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
