‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డెసిషన్ పై షాకింగ్‌ ట్విస్ట్‌..!

Tuesday, December 16, 2025

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్రిష, అభిరామిలు కథలో కీలక పాత్రలు పోషించగా, ఈ ప్రాజెక్ట్‌కి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కానీ, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

సినిమా రిజల్ట్ విషయంలో ఈ ప్రాజెక్ట్‌కి ఎదురైన అపజయం ఓటిటి రిలీజ్‌పై ప్రభావం చూపినట్లు వినిపిస్తోంది. అసలే మేకర్స్ ఈ సినిమాని థియేటర్లకు వచ్చిన ఎనిమిది వారాల తర్వాతే ఓటిటిలో రిలీజ్ చేస్తామంటూ ముందే ప్రకటించారు. అయితే, ఫలితం నిరాశపరిచిన తర్వాత ఆ నిర్ణయంలో మార్పు చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది.

ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌ వద్ద ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తాజా బజ్ ప్రకారం మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఓ ముందస్తు స్ట్రీమింగ్ రిలీజ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌తో పాటు మణిరత్నం, ఆర్ మహేంద్రన్ కలిసి నిర్మించారు. కథ, టెక్నికల్ పరంగా ఉన్న స్ట్రాంగ్ బేస్‌ ఉన్నా కూడా ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడంలో ఈ సినిమా వెనకబడ్డట్లు స్పష్టమవుతోంది. ఓటిటి విడుదలను వేగవంతం చేస్తారా? లేక మొదటి ప్లాన్‌నే ఫాలో అవుతారా? అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles