అమీర్‌ సినిమా పై ఎఫెక్ట్‌!

Friday, December 5, 2025

బాలీవుడ్‌లో Mr. Perfectionist అని పేరున్న అమీర్ ఖాన్‌కి ప్రస్తుతం మంచి హిట్ అవసరం అయ్యింది. గతంలో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు వచ్చిన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ పైనే ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీకి ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, స్పానిష్ మూవైన ‘ఛాంపియన్స్’ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు.

ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కగా, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. కానీ, సినిమాకి నిజంగా హిట్ టాక్ వస్తుందా లేదా అన్నది ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమీర్ ఖాన్ సినిమా విషయంలో ప్రజల్లో మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ కనిపిస్తోంది. కారణం ఇటీవల జరిగిన కొన్ని జాతీయ సంఘటనలపైన బాలీవుడ్ సెలబ్రిటీల మౌనం. ముఖ్యంగా పహాల్గామ్ దాడి సమయంలో చాలామంది ప్రముఖులు స్పందించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

ఈ సందర్భంలో, అమీర్ ఖాన్ సినిమా రిలీజ్ దగ్గరగా వస్తుండటంతో ఇప్పుడు ఆయన ప్రవర్తనపై కూడా నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. అప్పట్లో మౌనం పాటించిన వ్యక్తి, ఇప్పుడు సినిమాకోసం భావోద్వేగంగా కనిపించడం ఎంతవరకు నిజమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల సినిమా విజయంపై ప్రభావం ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

అయితే ఇది కేవలం ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ మాత్రమే. అసలు సినిమా ఫలితం మాత్రం జూన్ 20న విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. అమీర్ ఖాన్ మళ్లీ తన సత్తా చాటగలడా? లేక ఈసారి కూడా నిరాశే మిగులుతుందా? అనేది ఆ రోజు తేలనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles