నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన “హిట్ 3” సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హవా చూపిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన దగ్గరనుంచి అన్ని ప్రాంతాల్లో గట్టి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
తెలుగు రాష్ట్రాల దగ్గరే కాకుండా యూఎస్ మార్కెట్‌లో కూడా ఈ మూవీ భారీ వసూళ్లతో దూసుకుంటోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా రన్ అసలు తక్కువగా లేదు. ఇప్పటికే అక్కడ ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ సాధించింది. తాజాగా మరో లక్ష డాలర్ల వసూలుతో కలిపి మొత్తం 2.1 మిలియన్ డాలర్స్ మార్క్ దాటి పోయింది. ఈ ఫిగర్స్ చూసినవాళ్లకి సినిమా హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మిక్కీ జే మేయర్ ట్యూన్స్ కూడా సినిమాకి ప్లస్ అయి నిలిచాయి. ఇక “హిట్” ఫ్రాంచైజ్ నాల్గో పార్ట్‌పై కూడా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆ పార్ట్‌లో తమిళ స్టార్ హీరో కార్తీ కనిపించబోతున్నాడు. అంటే మల్టీ యూనివర్స్ కానెప్ట్‌లో ఈ ఫ్రాంచైజ్ ఇంకెంతో అద్భుతంగా విస్తరించబోతోందన్న మాట.
