ఆ డైరెక్టర్ తో గోపీచంద్ మరో సినిమా! మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘విశ్వం’ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించ లేకపోయింది. ఇక ఇప్పుడు గోపీచంద్ తన నెక్స్ట్ సినిమాని తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. అయితే, గతంలో తాను రెండు సినిమాలు చేసిన ఓ డైరెక్టర్‌తో ఇప్పుడు గోపీచంద్ ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
గతంలో ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకడు సంపత్ నంది త్వరలో గోపీచంద్‌తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గోపీచంద్ కోసం ఓ మంచి కథను రెడీ చేసి పెట్టాడట ఈ డైరెక్టర్. అయితే, సంపత్ నంది ప్రస్తుతం శర్వానంద్‌తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈసినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంపత్ నంది అనుకుంటున్నాడంట.ఇక ఆ తర్వాత వెంటనే గోపీచంద్‌తో సినిమాను ప్రారంభించాలని సంపత్ నంది ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అటు గోపీచంద్ కూడా ఈ లోపు ఓ సినిమాను ముగించుకుని సంపత్ నందితో సినిమా కోసం సిద్దం అవుతున్నాడంట. మరి వీరి కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.
