చైతూ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్! ప్రస్తుతం టాలీవుడ్ నుంచి విడుదలకి రాబోతున్న తాజా సినిమాల్లో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ ప్రేమ కథా చిత్రమే “తండేల్”.
కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇపుడు విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమా చైతూ కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ ని ప్రామిస్ చేస్తుండగా ఇపుడు యూఎస్ మార్కెట్ లో నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకునేలా ఉందని తెలుస్తోంది.
మరి నార్త్ అమెరికా ప్రాంతంలో చైతూ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన గత సినిమా లవ్ స్టోరీ కెరీర్ బెస్ట్ కాగా ఇపుడు దీనిని తండేల్ బీట్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇలా మొత్తానికి చైతు మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నాడని చెప్పుకోవచ్చు.