కన్ఫ్యూజన్ లో టాలీవుడ్‌ చందమామ!

Sunday, December 7, 2025

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ గురించి తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం , అభినయంతో కాజల్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరయ్యింది. కాజల్‌ తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్‌ ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ముందుకు సాగిపోతున్న సమయంలో కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ ని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది.

తెలుగులోకి  నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన భగవంత్‌ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్‌ కావడంతో కాజల్‌ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో కూడా గ్లామర్ పాత్రలు కాకుండా పెర్ఫార్మన్స్  రోల్స్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

అందులో భాగంగానే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ బాగున్నప్పటికీ వసూళ్ల పరంగా పెద్దగా రాలేదు. కానీ ఈ సినిమాలో కాజల్ యాక్షన్‌ సీక్వెన్స్ బాగా చేసింది. ప్రస్తుతం కాజల్‌ ఇండియన్ 2, కన్నప్ప సినిమాలో చేస్తుంది. అయితే ఈ రెండు పెద్ద సినిమాలే అయినప్పటికీ కాజల్ ది మాత్రం అతిథి పాత్రలే అని సమాచారం. దీంతో కాజల్‌ పరిస్థితి ప్రస్తుతం కన్ఫ్యూజన్‌ లో పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles