మొత్తానికి కన్ఫార్మ్ చేశారు రా బాబు!

Thursday, September 19, 2024

టాలీవుడ్ యంగ్‌ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్‌ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. రామ్‌, మాస్‌ డాషింగ్ డైరెక్టర్ పూరి కాంబోలో రాబోతున్న చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. ఈ సినిమా  గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపుగా వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం రామ్ ఫ్యాన్స్ తో పాటుగా మాస్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ గత కొన్నాళ్ల నుంచి అభిమానులు సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మే నెలలో రామ్ పుట్టినరోజు కానుకగా ఓ అప్డేట్ వస్తుంది అని ఆల్రెడీ బజ్ ఉంది. ఇక ఎట్టకేలకి ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ హింట్ ఇచ్చేసారు. రామ్ పోస్టర్ తో దీంతల్లి దిమాక్ కిరికిరి అవుతుంది ‘ఏదో వచ్చేలా ఉంది’ అంటూ అప్డేట్ రానున్నట్లు చెప్పేశారు.

ఇక దీని కోసం ఎదురు చూడటమే తరువాయి అని చెప్పాలి. ఇక భారీ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్‌  అందిస్తున్నారు. అలాగే పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles