కేసు నమోదుతో ఆగుతారా? చర్యలుంటాయా?

Tuesday, November 5, 2024

బహుశా ఈ అయిదేళ్ల పదవీకాలంలో ఇలాంటి పరిణామం ఒకటి జరుగుతుందని బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ఎన్నడూ ఊహించి ఉండరు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్నది ఒక్క సజ్జల రామక్రిష్ణారెడ్డికి మాత్రమే. ఆయనను కొందరు డీఫ్యాక్టో ముఖ్యమంత్రి అని, మరికొందరు సకలశాఖల మంత్రి అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఏయే కీలక సందర్భాల్లో అయితే ముఖ్యమంత్రి ప్రజల ఎదుటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందో.. అలాంటి అన్ని సందర్భాల్లోనూ మీడియాను పలకరించేది సజ్జల నే! అలాంటి వీవీఐపీ సజ్జల రామక్రిష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి మీద ఈ ప్రభుత్వంలోనే సీఐడీ కేసు నమోదు చేయడం అనేది ఆ పార్టీ వారికి అనూహ్యమైన సంగతి కావచ్చు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దళాలకు చీఫ్ గా నాయకత్వం వహిస్తున్నది సజ్జల భార్గవ్ రెడ్డే. ఆయన మీద ఇప్పుడు సీఐడీ కేసు నమోదు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏలుబడి సాగిన 59 నెలల్లో సీఐడీ విభాగం అంటే.. రాజకీయ ప్రత్యర్థుల మీద, తెలుగుదేశం పార్టీకి చెందిన వారి మీద, సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపించే మామూలు సాధారణ వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి.. వారిని ఇబ్బంది పెట్టే సంస్థగా మాత్రమే ముద్రపడింది.

అయితే ఇప్పటికైనా సరే.. ఎన్నికల సంఘం చొరవతీసుకున్నది గనుక.. వారి ఆదేశాలను.. పోలీసు, సీఐడీ యంత్రాంగాలు అందరూ అనుసరించి తీరాల్సిందే గనుక.. భార్గవ్ మీద కేసు నమోదు అయింది.
సోషల్ మీడియాను.. తమ ప్రత్యర్థుల మీద ఎంత నీచంగా వాడాలో అంతకంటె నీచంగా వాడడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు ఆరితేరిపోయాయి. వారందరూ కూడా భార్గవ్ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటారు. వారి సోషల్ మీడియా విభాగాల్లో నారా చంద్రబాబునాయుడు మీద అసత్య ప్రచారం నడుస్తున్నదని.. దానిని అరికట్టాలని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. దాని పర్యవసానమే.. ఈసీ ఆదేశాలు. మొత్తానికి సజ్జల భార్గవ్ మీద కేసు నమోదు కావడం.
అయితే కేసు నమోదు చేయడంతో ఊరుకుంటారా? భార్గవ్ మీద ఇంకాస్త చర్యలు తీసుకుంటారా? అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles