మోడీకి జగన్ చేస్తున్న హెచ్చరిక ఇది!

Friday, November 15, 2024

మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఫరెగ్జాంపుల్.. అమితాబ్ తో రామ్‌గోపాల్ వర్మ తీసిన సర్కార్ సినిమా అనుకోండి. విలన్ వచ్చి సర్కార్ వద్ద ఓ బిజినెస్ ప్రపోజల్ పెడతాడు. దానిని సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తాడు. ఇక సర్కార్ ను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం సాధ్యం కాదని అర్థమయ్యాక విలన్.. సర్కార్ కు సంబంధించిన మనుషులను, వ్యవహారాలను టార్గెట్ చేస్తాడు. వారిని దెబ్బకొట్టడం ద్వారా సర్కార్ కు హెచ్చరిక పంపాలని అనుకుంటాడు.

ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే వ్యవహారం అచ్చంగా అలాగే కనిపిస్తోంది. అమరావతి వేదికగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ మీద జరిగిన దాడి, అతని సహాయకుడి మీద జరిగిన హత్యాయత్నం వ్యవహారాలు తేలికగా తీసుకోదగినవి కాదు. అవి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికకు సంకేతాల్లాగా కనిపిస్తున్నాయని పలువురు మాట్లాడుకుంటున్నారు.
ఏపీలోని భారతీయ జనతా పార్టీ నాయకులు అడపాదడపా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు విమర్శలు చేస్తూనే వచ్చినప్పటికీ.. వైసీపీ వారి పట్ల దూకుడుగా స్పందించినది లేదు. బిజెపితో తనకు చాలా సత్సంబంధాలు ఉన్నాయని జగన్ పదేపదే చెబుతుంటారు. మోడీ తనకు ఆత్మబంధువు అన్నట్టుగా ఆయన అంటుంటారు. ఆ నేపథ్యంలోనే ఏపీ బిజెపి నేతలను, వైసీపీ ప్రభుత్వం ఏమీ అనకుండా మిన్నకుంటుందనే అభిప్రాయం పలువురిలో ఉండేది.
జగన్ తన వ్యక్తిగత అవసరాలు, కేసులనుంచి బయటపడడం కోసమే మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, కేసులు తీవ్రదశకు వచ్చిన ప్రతిసారీ ఢిల్లీ వెళ్లి మోడీని కలిసివస్తుంటారని అనేక ఆరోపణలు వినిపిస్తుంటాయి. తన మీద ఉన్న కేసులు, తాజాగా తన సోదరుడు అవినాష్ రెడ్డి చుట్టూ ముడిపడుతున్న బాబాయి వివేకా హత్య కేసు లనుంచి విముక్తి కోసం ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి వచ్చినట్టుగా కూడా ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు.
ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో బిజెపి నాయకుల మీద దాడి జరిగింది. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మనుషులే దాడికి పాల్పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీని వెనుక సీఎం వైఎస్ జగన్ స్కెచ్ ఉన్నదని కూడా కొందరు విమర్శిస్తున్నారు. ఇది యథాలాపంగా జరిగిన దాడి కాదని, కేసులకు సంబంధించి మోడీతో బేరం చెడినందునే.. బిజెపిలో కీలకమైన సత్యకుమార్ మీద దాడి జరిగిందని ఇప్పుడు పలువురు విశ్లేషిస్తున్నారు. కేసుల విషయంలో జగన్ బేరాలకు మోడీ అంగీకరించలేదని, అందుకు జవాబుగా, పార్టీ కీలక నాయకుడు సత్యకుమార్ మీద దాడి ద్వారా జగన్ ఈ హెచ్చరిక పంపించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది నిజం కాదని, స్థానికులు రెచ్చిపోయి చేసిన దాడి తప్ప.. దీని వెనుక తన పార్టీ లేదని వైఎస్ జగన్ ఎలా నిరూపించుకుంటారో అర్థం కావడం లేదు. నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారో.. లేదా, తన హెచ్చరిక సంకేతం స్పష్టంగా కేంద్ర బిజెపి నాయకత్వానికి అందాలని సైలెంట్ గా ఉండిపోతారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles