సోషల్ మీడియాలో బీజేపీ జాబితా హల్ చల్!

Monday, January 20, 2025

కర్ణాటక ఎన్నికల అనంతరం రెండు నెలల పాటు రాష్త్ర అధ్యక్ష పదవిపై నెలకొన్న వివాదం, కొత్తగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టడంతో ఏర్పడిన సందిగ్థత కారణంగా తెలంగాణాలో బీజేపీ చతికలపడినల్టు, కాంగ్రెస్ పుంజుకున్నట్లు కనిపించినా నెమ్మదిగా రాజకీయ పరిస్థితులను తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించినట్లు కనిపిస్తున్నది.

బండి సంజయ్ మాదిరిగా కేవలం మీడియా హైప్ పై ఆధారపడకుండా, అధికార పక్షాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకుండా కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ రాజకీయ పరిస్థితులపై తమ మార్క్ చూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ హయాంలో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వంటి నేతలను క్రియాశీలం చేయగలిగారు.

మరోవంక, మొదటి సారిగా పలువురు మాజీ ఎమ్యెల్యేలు, వివిధ నియోజకవర్గాలలో పట్టుగల నేతలు బీజేపీలో చేరడం ప్రారంభించారు. తాజాగా ప్రముఖ నటి జయసుధ బీజేపీలో చేరడంతో కొంత జోష్ ఆ పార్టీలో చెలరేగిన్నట్లు చెప్పవచ్చు. ఒక వంక తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు, బిజెపి కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఉండేవిధంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణకు సంబంధించిన వ్యూహాలను అమలు పరుస్తున్నారు.

ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు అందరూ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయని పలువురు నేతలు అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశించారు. దానితో గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తున్న బిజెపి నేతకులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోతుంది.

ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థులు అంటూ బుధవారం నుండి సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతుంది. ఈ జాబితా చూస్తుంటే తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, దానితో బిజెపితో కలిపి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందనే ఆలోచనతో బిజెపి నాయకులు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. కనీసం 15 సీట్లు గెల్చుకొంటే తాము లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండదని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభ్యర్థుల జాబితా:
1. కిషన్ రెడ్డి…. అంబర్ పెట్, 2.  కే లక్ష్మణ్…. ముషీరాబాద్,  3. బండి సంజయ్…. కరీంనగర్,  4. సోడియం బాపూరావు …బోధ్, 5. ధర్మపురి అరవింద్…. ఆర్మూరు, 6. ఈటెల రాజేందర్…. గజ్వేల్, 7. రఘునందన్ రావు…. దుబ్బాక, 8. డీకే అరుణ…. గద్వాల్, 9. జితేందర్ రెడ్డి… మహబూబ్ నగర్, 10. రాజగోపాల్ రెడ్డి…..మునుగోడు.
11. మురళీధర్ రావు .. వేములవాడ లేదా కూకట్పల్లి, 12. ఎన్ ఇంద్రసేనారెడ్డి….. ఎల్బీనగర్, 13.  వివేక్….. చెన్నూరు, 14. విజయశాంతి…. మెదక్, 15.  ఎండల లక్ష్మీనారాయణ…. నిజామాబాద్ అర్బన్, 16. రామచంద్రరావు…. మల్కాజిగిరి, 17.  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్… ఉప్పల్, 18.  ఆచారి….. కల్వకుర్తి, 19. జయసుధ…. సికింద్రాబాద్, 20.  రాథోడ్ రమేష్…. ఆసిఫాబాద్.

21. పొంగులేటి సుధాకర్ రెడ్డి…. ఖమ్మం, 22.  బాబు మోహన్… ఆందోల్, 23.  నందీశ్వర్ గౌడ్… పఠాన్ చెరువు, 24. బూర నర్సయ్య గౌడ్… భువనగిరి, 25.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి… తాండూరు, 26. గరికిపాటి మోహన్ రావు…. వరంగల్, 27. ఈటెల జమున…. హుజూరాబాద్, 28.
విక్రమ్ గౌడ్… గోషామహల్

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles