పులివెందులలో జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

Thursday, May 16, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంకు పులివెందుల గత 45 ఏళ్లుగా కంచుకోటగా ఉంటూ వస్తున్నది. ఆయన కుటుంబసభ్యులే 1978 నుండి అక్కడి నుండి వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యర్థులకు డిపాజిట్ రావడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక విధంగా అక్కడ జగన్ కుటుంభంకు తిరుగు లేదు. వ్యవస్థలు అన్ని ఆయన కుటుంభంకు లొంగి ఉండాల్సిందే.

మొదటిసారిగా, పులివెందులకు చెందిన వ్యక్తి గత అక్టోబర్ లో పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్యెల్సీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబందించిన పలు అంశాలు ఇటీవల వెలుగులోకి వస్తుండటం, కుటుంబసభ్యులే అందులో కీలకంగా వ్యవహరించినల్టు సిబిఐ ఉన్నత న్యాయస్థానాలలో పేర్కొనడమే కాకుండా, స్వయంగా వైఎస్ జగన్ బాబాయిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు పరిస్థితులలో మార్పు వస్తుందా? అనే అభిప్రాయం కలుగుతుంది.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆ గ్రామంలో జరిపిన రోడ్ షో, బహిరంగసభలకు ఎవ్వరూ ఊహించనంతటి స్పందన లభించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో నిర్వహించిన సభలో సిఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

45 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా సార్లు పులివెందుల వచ్చానని, ప్రస్తుతం ప్రజల స్పందన చూస్తే ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం యద్ధభేరీ కి నేడు పులివెందులకు రాగా పెద్ద ఎత్తున రైతులు తరలి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

పులివెందులలో టీడీపీ మీటింగ్ తీరును తాడేపల్లిలో ఉంటున్న జగన్ చూడాల్సిన అవసరం ఉందని, పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారో అప్పుడైన జగన్ కు తెలిస్తుందని చంద్రబాబు చెప్పారు. అయినా పోయిరావలె హస్తినకు అన్నట్లు….జగన్ లో మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలని అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

 వచ్చే ఎన్నికల్లో పులివెందుల ఎందుకు గెలవాలో ఈ మీటింగ్ ద్వారా మీకు వివరిస్తానని ఆంటూ రాత్రి పొద్దుపోయే వరకు ఆయన తన ప్రసంగం సాగించారు. ‘పులివెందుల బిడ్డ’ను అని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్లుగా సొంత నియోజకవర్గంలోనే బారికేడ్ల మధ్య పర్యటించడమే అక్కడి జనానికి తెలుసు. 

ఇప్పుడు.. ఓపెన్‌ టాప్‌ జీపులో అభివాదం చేసుకుంటూ, జనం మధ్యలోకి వచ్చిన చంద్రబాబుకు స్థానికులు జేజేలు పలికారు.  గతంలో కనీవినీ ఎరుగని విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల సామాన్య జనంలో ఆదరణ కనిపించిందని అంటూ ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నారు.

దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షోకు గంటపైనే పట్టింది. దారి పొడవునా మహిళలు, యువత మిద్దెలు ఎక్కి చంద్రబాబు కోసం ఎదురు చూశారు. బహిరంగసభలో బాబాయ్‌ హత్యకేసు, కోడికత్తి కేసు, వలంటీర్ల గురించి మాట్లాడాలంటూ చంద్రబాబుకు కార్యకర్తలు, ప్రజలే విజ్ఞప్తి చేయడం గమనార్హం. 

వివేకా హత్య గురించి మాట్లాడేటపుడు అపూర్వ స్పందన వచ్చింది. వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు… తెలిసిన వాళ్లు చేతులెత్తండి అని చంద్రబాబు పిలుపునిచ్చినప్పుడు భారీఎత్తున పైకి ఎత్తారు. జనం స్పందనతో చంద్రబాబులో సహితం మంచి జోష్ కనిపించింది. తనకు వయసు అయిపోయింది అంటున్నాడని, నా విషయంలో వయసు అనేది కేవలం ఒక నంబరే అంటూ సింహం ఎప్పటికీ సింహమేనని చంద్రబాబు సమరోత్సాహంతో చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles