సీఎం అభ్యర్థి అనుకున్న ఈటెలకు బీజేపీలో కాలం చెల్లిందా!

Wednesday, December 18, 2024

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురించి కొద్దీ రోజులుగా మీడియాలో వస్తున్న వార్తాకథనాలు చూస్తుంటే ఆయనకు బీజేపీలో ఇక కాలం చెల్లిన్నట్లే అని స్పష్టం అవుతుంది.  కేసీఆర్ మంత్రివర్గంలో నం 2గా కొనసాగిన ఈటెల తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు.

అటువంటి కీలక నేత వచ్చి బీజేపీలో చేరగానే ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. పైగా, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిష్టాకరంగా తీసుకొని, మంత్రులు అందరిని పురమాయించి, భారీగా నిధులు ఖర్చు పెట్టినా హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటెల మంచి ఆధిక్యతతో గెలువపండడంతో బిజెపికి తెలంగాణాలో పెద్ద మాస్ లీడర్ దొరికారని ఆ పార్టీ అగ్రనేతలు సంబరపడిపోయారు.

ఈటెలను ఆయుధంగా వాడుకొని కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చివేయవచ్చని అంచనాలు వేసుకున్నారు. అందుకనే ఆయన నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరం గడిచినా ఆయన ఒక్క చెప్పుకోదగిన నేతను కూడా బిఆర్ఎస్ నుండి తీసుకు రాలేకపోయారు.

పైగా, బిఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురై ఏదో ఒక పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీలోకి తీసుకు వస్తారనుకొంటే వారే తనకు `రివర్స్ కౌన్సిలింగ్’ చేసారంటూ ఈటెల స్వయంగా వాపోయారు. దానితో బిజెపి అధిష్టానం వద్ద ఈటెల గ్రాఫ్ పడిపోయింది.

కనీసం, కేసీఆర్ మంత్రివర్గంలో సుదీర్ఘకాలం కీలక మంత్రిగా కొనసాగి, ఆర్ధిక శాఖ వంటి కీలక ఆశాఖను నిర్వహించిన ఈటెల కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టె విధంగా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన సమాచారం అందిస్తారనుకొంటే బిజెపి పెద్దలకు నిరాశే ఎదురైంది.

బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత పేరొచ్చినా ఢిల్లీ మద్యం కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలు నుండి కేసీఆర్ ప్రభుత్వకు సంబంధించిన అనేక అంశాలపై స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పలు పర్యాయాలు ఈటెలను ఢిల్లీకి పిలిపించుకొని సమాలోచనలు జరిపారు.  అయితే, ఈటెల ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగల ఒక్క సమాచారాన్ని కూడా రాజేందర్ ఇవ్వలేక పోయారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చి రాజేందర్ ను ఆ పదవిలో కోర్చోపెట్టాలని అనుకున్న బిజెపి పెద్దలకు ఆయన పనితీరు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. కనీసం కర్ణాటక ఫలితాల తర్వాతనైనా తనకు రాష్త్ర నాయకత్వం అప్పజెబుతారని ఆశించి ఢిల్లీ వెళ్లిన ఈటెలకు నిరాశే ఎదురైంది.

పైగా, సంజయ్ ను మార్చే ప్రసక్తి లేదంటూ పార్టీ కేంద్ర నేతలు ఒకరొక్కరు స్పష్టం చేస్తూ వస్తున్నారు. దానితో ఈటెల కూడా వాస్తవం గ్రహించి ఎన్నికల ముందు రాష్ట్ర అద్యక్షుడిని మార్చికపోవచ్చని చెప్పేసారు.  ఈటెల స్వయంగా ఇక చేరికలు లేవని చేతులెత్తేయడంతో తెలంగాణాలో బిజెపి పనైపోయిన్నట్లు ఆర్ధిక మంత్రి హరీష్ రావు చేసిన వాఖ్యాలను ప్రస్తావిస్తూ బిజెపి కీలక నేత, మాజీ ఎంపీ విజయశాంతి చేసిన వాఖ్యలతో  పరోక్షంగా బీజేపీలో ఈటెల ప్రస్తావన ముగిసిన్నట్లే అన్న సంకేతం ఇచ్చినట్లయింది.

గతంలో అనేక ఎన్నికలలో వచ్చిన ఫలితాలను ఆమె ప్రస్తావిస్తూ దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా? చేరికల కమిటీతో వచ్చాయా? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా?  విశ్లేషించుకోవాలి అంటూ విజయశాంతి వేసిన ప్రశ్నలు పరోక్షంగా ఈటెలపై సంధించిన బాణాలుగా స్పష్టం అవుతుంది.

బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే అని స్పష్టం చేయడం ద్వారా ఈటెల వంటి నాయకులు ఉంటె ఎంత, లేకపోతే ఎంత అన్నట్లు ఆమె మాట్లాడిన మాటలు వెల్లడి అవుతుంది.

అయితే విజయశాంతి చేసిన ట్వీట్ లో చేరికల కమిటీతో వచ్చిన ఫలితం ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు. గతంలో జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం వెనక చేరికల కమిటీ ప్రయత్నం ఏమీ లేదని, అది సాధించిన విజయం ఏదీ లేదని విజయశాంతి స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles