కలకలం రేపుతున్న కేశినేని నానిపై పివివి ఘాటు విమర్శలు

Thursday, March 28, 2024

విజయవాడ ఎంపీ కేశినేని నాని టిడిపి నాయకత్వం పట్ల కొంతకాలంగా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నా, వైసిపి ఎమ్యెల్యేలతో వేదికలు పంచుకొంటూ పరస్పరం ప్రశంసలు కురిపించుకొంటున్నా  టిడిపి నేతలు ఎవ్వరు స్పందించడం లేదు. దాదాపు మౌనం పాలిస్తున్నారు.

తాజాగా, బుధవారం మైలవరంలో వైసిపి ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి వేదిక పంచుకొంటూ టిడిపి సీట్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించినా టిడిపి వర్గాల నుండి స్పందన లేదు.

అంతేకాదు, తనను చూసి నచ్చి ఎవ్వరు సీట్ ఇచ్చినా సరే అంటూ వైసిపిలో చేరేందుకు సుముఖతను పరోక్షంగా వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసిపి ఎంపీ అయోధ్య రామిరెడ్డి వంటి వారు నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. వైసిపిలోకి వస్తే స్వాగతిస్తామని కూడా స్పష్టం చేశారు.

ఇంత జరుగుతున్నా టిడిపి నేతలు మౌనంగా ఉంటున్నా, కొంతకాలంగా రాజకీయంగా క్రియాశీలంగా లేని వైసిపి నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త నానిపై ట్వీట్ ద్వారా విరుచుకు పడటం ఆసక్తి కలిగిస్తుంది. పొట్లూరి వరప్రసాద్‌  ఎంపీ కేశినేని నానిపై ఘాటుగా విమర‌్శలు గుప్పించారు.

నీ బిల్డప్ ఏందయ్యా అంటూ ఎంపీ నానిని ట్యాగ్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వెదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండాలని.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!” అంటూ ఎద్దేవా చేశారు.

పొట్లూరి వరప్రసాద్ 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు 8వేల ఓట్ల తేడా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పివిపి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి వచ్చే ఎన్నికలలో విజయవాడ నుండి పోటీచేయాలని అనుకుంటున్నట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

అటువంటి సమయంలో వైసిపిలోకి వచ్చేందుకు నాని సంకేతాలు ఇవ్వడంతో ఆయన మండిపడినట్లు స్పష్టం అవుతుంది. అందుకనే నానిపై ఆయన ఇచ్చిన ట్వీట్ వైరల్ అవుతుంది. విజయవాడలో రాజకీయంగా కలకలం రేపుతోంది.

ఎంపీ నాని వైసీపీకి చేరువవుతున్నారనే ప్రచారాలతో పాటు వైసీపీ నుంచి కూడా అతడిని స్వాగతించే ప్రకటనలు వస్తుండటం పివిపికి ఆగ్రహం కలిగించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన పివిపి ఈసారి ఎన్నికల్లో తనను కాదని కేశినేని వైపు పార్టీ మొగ్గు చూపుతుందనే భావనలోనే ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడూలేనిది ఇప్పుడు నానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ ఇవ్వడం అంటే నాని వైసిపిలోకి దూకితే తాను టిడిపిలోకి వచ్చేందుకు సిద్దమనే సంకేతం ఇస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విజయవాడలో ఎవ్వరికీ సీట్ ఇచ్చినా ఇబ్బందే అన్న ఇరకాటంలో ఉన్న పార్టీ అధినేత చదన్రాబాబు నాయుడుకు పివివి వాటిని వారికి సీట్ ఇవ్వడం సౌకర్యంగా ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles