“అయోధ్యా, మధురా మాయా, కాశీ కంచి అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైతే మోక్ష దాయకా” అఖండ భారత దేశంలో అతి పురాతనమైన, పురాణ కాలంనాటి ఏడు ప్రాచీన క్షేత్రాలు ఉన్నాయి. వీటినే సప్త పురాలు అని అంటారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఈ పురాలు, ‘సప్త మోక్ష పురములు’గా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. భారతీయ పురాణాలను అనుసరించి, జీవిత చరమాంకంలో ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే పాపాలన్నీ సమిసి పోయి స్వర్గ లోక ప్రాప్తి దొరుకుతుందని హిందువుల నమ్మకం. అటు పురాణపరంగాను … ఇటు చారిత్రక పరంగాను ఈ ప్రాంతాలు దివ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. మానవుల జీవితాలపై ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తూ, అణువణువున భక్తిభావ పరిమళాలను వెదజల్లుతున్నాయి. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత తమ బ్రహ్మణ, గురువు, బంధు తదితర హత్య దోష నివారణ కోసం ఈ ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించి అటు పై మాత్రమే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు.మానవ దేహంలో ఉన్న ఏడు చక్రాలు ఈ సప్త మోక్షపురములందు నిక్షిప్తం చేయబడి ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే పాపాలన్నీ సమిసి పోయి స్వర్గ లోక ప్రాప్తి దొరుకుతుందని హిందువుల నమ్మకం. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత తమ బ్రహ్మణ, గురువు, బంధు తదితర హత్య దోష నివారణ కోసం ఈ ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించి అటు పై మాత్రమే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు.
ఈ సప్తపురాలు, రామజన్మభూమి అయిన అయోధ్య (ఉత్తర ప్రదేశ్ )లో ‘సహస్రాకార చక్రం’ … శ్రీ కృష్ణుడి జన్మ భూమి అయిన మధుర (ఉత్తర ప్రదేశ్ )లో ‘ఆజ్ఞా చక్రం’ … హరిద్వారం (ఉత్తర ప్రదేశ్ )లో ‘విశుద్ధ చక్రం’… కాశీ (ఉత్తర ప్రదేశ్ )లో ‘అనాహత చక్రం’ … కంచి (తమిళనాడు .. శివకంచి – విష్ణుకంచి)లో చక్ర ప్రభావం చెరి సగానికి వర్తిస్తుంది. ఇక అవంతిక (మధ్య ప్రదేశ్ )లో ‘మణిపూరక చక్రం’ … ద్వారక (గుజరాత్ )లో మూలాధార చక్రం స్థాపించబడి వున్నాయి. వీటిని దర్శించడం కారణంగా మోక్షం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.