మహిళల మిస్సింగ్ పై జగన్ కు కేంద్రం షాక్!

Tuesday, November 19, 2024

ఏపీలో 27 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, వారిలో కొందరు వాలంటీర్లు సేకరించిన డేటా కారణంగా అయ్యారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల `వారాహి విజయ యాత్ర’ సందర్భంగా చేసిన ఆరోపణలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. పవన్ పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు విమర్శలు గుప్పించారు.

జిఓ ప్రకారం పదవీకాలం పూర్తయినా ఇంకా కొనసాగుతున్న ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ అయితే ఆవేశంతో ఊగిపోయారు. పది రోజుల లోపుగా ఆధారాలు చూపమని, లేకపోతే క్షమాపణలు చెప్పమని పవన్ కళ్యాణ్ కు నోటీసు పంపారు.  ఈ సందర్భంగా ఆమె రాజకీయ ప్రసంగాలు కూడా చేశారు.

స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వాఖ్యలపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూ పవన్ వివాహాల గురించి, విద్యార్థిగా నారా లోకేష్ అమెరికాలో స్నేహితురాల్లో ఉన్న ఫోటోల గురించి, నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో చేసిన వాఖ్యల గురించి, చంద్రబాబు నాయుడు గురించి కూడా బహిరంగసభలో ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ వాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు ప్రదర్శనలు జరిపారు. ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ పై పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు ఓ ప్రత్యేక జిఓ తీసుకువొచ్చింది. ఆ తర్వాత ఓ మహిళా వాలంటీర్ చేత విజయవాడ సివిల్ కోర్టులో దావా వేయించారు. ఏపీలో అసలు తమని మహిళలు మిస్సింగ్ అయిన్నట్లు పొలిసు రికార్డులలో లేదంటూ వాదిస్తూ వచ్చారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన సమాచారం సీఎం వైఎస్ జగన్ కు పెద్ద షాక్ కలిగించినట్లయింది. పవన్ కళ్యాణ్ పై ఇప్పటివరకు చేస్తున్న దండయాత్రలు ఎద్దేవా చేసినట్లయింది. రాజ్యసభలో మహిళల మిస్సింగ్ పై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

2019-22 మధ్య రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులపై సమాచారం ఇచ్చింది. ఏపీలో 2019-2022 మధ్య 30ఫై వేల మంది బాలికలు, మహిళలు ఏపీలో అదృశ్యం అయ్యారని అందులో పేర్కొంది. ఈ లెక్కలు ఏపీ రాజకీయాల్లో మళ్లీ పెద్ద దుమారాన్ని రేపే అవకాశం ఉంది. వీటిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తోందో వేచిచూడాల్సి ఉంది.

ఏపీలో 2019లో 2186 మంది బాలికలు (18 ఏళ్లు కన్నా తక్కువ వయసున్నవారు), 6252 మంది మహిళలు మిస్సైయ్యారని కేంద్ర హోంశాఖ తెలిపింది. 2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళలు, 2021లో 3358 మంది బాలికలు, 8969 మంది మహిళల ఆచూకీ లభించలేదని ఆ లెక్కలు చెబుతున్నాయి.  మూడేళ్లలో మిస్సైన వారి 30196గా ఉంది. వీరిలో కొంత మంది ఆచూకీ అనంతరం తెలిసిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

మూడేళ్లలో దేశం మొత్తం మీద మూడున్నర లక్షల మందికి పైగా బాలికలు, మహిళల ఆచూకీ దొరకలేదని కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలిపింది. తెలంగాణలో దాదాపుగా 40 వేలకు పైగా మిస్సింగ్ కేసులో నమోదయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. కేంద్రంవిడుదల చేసిన గణాంకాలతో ఈ వివాదం  మరోసారి కలకలం రేపే అవకాశం ఉంది. అయితే మహిళల మిస్సింగ్‌కు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు సంబంధం లేదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మిస్సింగ్ కేసులతో వాలంటీర్లకు సంబంధంలేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి.

పవన్ పై కేసు వెనుకకు పంపిన కోర్టు

ఇలా ఉండగా, పవన్ కల్యాణ్ పై దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ ను  విజయవాడ కోర్టు తిప్పిపంపింది. ఈ వ్యవహారంపై విచారణ చేసే అధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో చెప్పాలని కోరింది. పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్ఠను ఏవిధంగా దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వాలంటీర్ గా నియమించినట్లు అపాయింట్మెంట్ లెటర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles