ఫోన్ ట్యాపింగ్ పై అమిత్ షాకు కోటం రెడ్డి ఫిర్యాదు

Thursday, December 19, 2024

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నది. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లు గతంలో టీడీపీ ఆరోపించగా, ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని పేర్కొనడం ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతోంది.

పైగా, అందుకు సాక్ష్యంగా నేరుగా సీఎం వైఎస్ జగన్ పర్యవేక్షణలో పనిచేసే రాష్ట్ర నిఘా విభాగ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు తనకు వాట్స్ అప్ ద్వారా పంపిన తన ఫోన్ రికార్డునే ప్రదర్శించడం సంచలనంకు దారితీస్తుంది. ఇప్పుడు నేరుగా ఈ వ్యవహారంపై కోటం రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం కోటంరెడ్డి లేఖ రాశారు.

ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ రోజే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిస్తున్నానని, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని మీడియా సమావేశంలో తదుపరి వెల్లడించాయిరు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను వెల్లడించినప్పటి నుండి  వైసీపీ నేతలు తనను టార్గెట్ చేశారని నన్ను, పైగా తనను అరెస్ట్ చేయిస్తాం అంటూ బెదిరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేశారు.

ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా తాను నిజాలు మాట్లాడుతునే ఉంటానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయమని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. నన్ను తిట్లు తిట్టడం కాదు. అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలి” అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ విషయమై కేంద్రం నుండి స్పందన లేని పక్షంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తానని సహితం ఈ సందర్భంగా సంకేతం ఇవ్వడంతో ఈ ఫోన్ ట్యాప్ప్పింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో మరిన్ని అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇదివరకే తిరుగుబాటు ఎంపీ రామకృష్ణంరాజు సహితం తన ఫోన్ లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ మధ్యనే పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహితం అటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles