ప్రధాని మోదీపై రేణుకా చౌదరి పరువు నష్టం దావా!

Sunday, December 22, 2024

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి  పరువు నష్టం దావా కేసులో  గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో, ఆయనపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు విధించడం దేశంలో రాజకీయంగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఆయన ఎనిమిదేళ్లపాటు ఎన్నికలలో పోటీకి అనర్హుడు.

అయితే, తెలుగు రాష్ట్రాలలో సంచలన రాజకీయ వేత్తగా పేరొందిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఇప్పుడు ప్రధాని మోదీ మీద పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించి కలకలం రేపుతున్నారు. 2018లో పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తనను ‘సూర్పనఖ’ అన్నందుకు పరువు నష్టం దావా చేయబోతున్నట్లు ప్రకటించారు.

‘చూద్దాం ఇప్పుడు కోర్టు ఎంత సత్వరంగా ప్రతిస్పందిస్తుందో’ అని రేణుకా చౌదరి ట్వీట్ చేశారు. తాను నవ్వినందుకు పార్లమెంటు సమావేశంలో ప్రధాని మోడీ తనను రామాయణంలో సూర్పనఖతో పోల్చి అవమానించారని రేణుకా చౌదరి పాత వీడియోను షేర్ చేశారు.

తన పేరెత్తకుండానే రామాయణం సీరియల్‌లోని సూర్పనఖ పాత్రతో అవమానించారని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఆయన(మోదీ) మీద పరువు నష్టం దావా వేస్తాను. చూద్దాం కోర్టు ఎంత సత్వరంగా పనిచేస్తుందో’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రామాయణం సీరియల్ ప్రసారమైన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరిని కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్ర మోదీ రాజ్యసభ ఛైర్మన్‌ను కోరిన క్లిప్ ను ఆమె జత చేశారు. అయితే, ప్రధాని మోదీ శూర్పణఖ అనే పదాన్ని ప్రస్తావించలేదని, పార్లమెంటులో చేసిన ప్రకటనపై ఆమె కోర్టుకు వెళ్లలేరని బిజెపి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

విపక్షాల అంతరాయం మధ్య రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు 2018 ఫిబ్రవరి 7వతేదీన ఈ గొడవ మొదలైంది. కాంగ్రెస్‌కు చెందిన రేణుకా చౌదరి అప్పటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు నుంచి మందలింపును ఆహ్వానిస్తూ నవ్వారు.

‘‘సభాపతి జీ, మేరీ ఆప్కో ప్రార్థనా హై రేణుకా జీ కో ఆప్ కుచ్ మత్ కహియే. రామాయణం సీరియల్ కే బాద్ ఐసే హసీ సునానే కా ఆజ్ సౌభాగ్య మిలా హై’’ (గౌరవనీయమైన చైర్మన్, రేణుకాజీతో ఏమీ చెప్పవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. రామాయణం సీరియల్ తర్వాత, అవకాశం వచ్చింది. మొదటి సారి అలాంటి నవ్వు వినడం కోసం) అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వాయ్‌నాడ్ పార్లమెంటు సభ్యుడైన రాహుల్ గాంధీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఈ దొంగలందిరికి ఉమ్మడిగా మోదీ ఇంటిపేరు ఎలా ఉంటుంది?” అంటూ ప్రశ్నించారు.  దానిపై గుజరాత్‌కు చెందిని బిజెపి ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాంధీ మీద క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.

సూరత్‌కు చెందిన కోర్టు నాలుగేళ్లపాటు విచారణ అనంతరం గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించేసింది. బహుశా రాహుల్ గాంధీని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి తప్పించేయడానికి వేసిన ఎత్తుగడ ఇదేమోనని కూడా కొందరు అనుమానిస్తున్నారు.

నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ… ఇలా మోదీలందరూ ఏదో ఒక కేసులో నిందితులు, దోషులే. అందుకనే రాహుల్ గాంధీ అలా వ్యాఖ్యానించారు.విచారణ సమయంలో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. పైగా తాను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని న్యాయమూర్తికి తెలిపారు.

కోర్టు తీర్పు వెలువడ్డాక రేణుకా చౌదరి ‘రాహుల్ గాంధీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు క్షమాపణలు చెప్పలేదు. ఫాసిజంకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు క్షమాపణ చెప్పలేదు. నిజం మాట్లాడుతున్నందుకు కూడా ఆయన క్షమాపణ కోరాలనుకోలేదు’ అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles