ధరణి పోర్టల్ పై నడ్డా – సంజయ్ చెరో మాట

Sunday, December 22, 2024

తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తున్నామంటున్న బిజెపి నేతలలో ఎవ్వరి దారి వారిదయింది. కీలక మైన ప్రజాసమస్యల పైన కూడా అంతర్గతంగా చర్చలు, అధ్యయనాలు, నిర్దుష్టమైన విధానం రూపొందించుకోవడం లేదని మరోసారి స్పష్టమైంది. ఎవ్వరికీ ఇష్టం వచ్చిన్నట్లు వారుగా మాట్లాడుతూ జనం ముందు బిజెపి నేతలు నవ్వుల పాలవుతున్నారు.

తాజాగా, ధరణి పోర్టల్ పై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ బహిరంగసభలో చేసిన వాఖ్యలు ఆ పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న అంతరాన్ని బయటపెట్టింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన ఈ పార్టీ అసలు పేరు ‘భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని నడ్డా ఆక్షేపించారు. రైతులను పీడించి తమ జేబులను నింపుకోవడానికే ధరణి పోర్టల్ ఉందని విమర్శించారు.

ధరణితో భారీ అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని నడ్డా సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోర్టల్ కూడా బంద్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఈ విషయమై రాష్ట్రంలోని బిజెపి నేతలను గందరగోళంకు గురిచేస్తున్నది.

ఎందుకంటె, కొద్ది రోజుల క్రితం ధరణి పోర్టల్‌పై మట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అది మంచి స్కీమ్ అని అన్నారు. కాకపోతే అందులో కొన్ని సమస్యలు ఉన్నాయిని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు తొలగించి ధరణిని కొనసాగిస్తామని చెప్పారు.

రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగిస్తామని చెబుతుంటే.. జాతీయ అధ్యక్షుడు రద్దు చేస్తామని ప్రకటించారు. ఇలా నేతలు ధరణి పోర్టల్‌పై తలో మాట మట్లాడటంతో బిజెపి రాజకీయంగా నవ్వులపాలవుతుంది. ధరణి పోర్టల్ ను అడ్డాగా చేసుకొని బిఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంభం సభ్యులు భారీ మొత్తంలో భూములను కాజేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దుచేస్తామన్ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించగానే, ఆ మరుసటి రోజే బిజెపి అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ నే కాకుండా కేసీఆర్ ప్రారంభించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని సంజయ్ ప్రకటించారు. అయితే, అవసరమైన మార్పులు చేస్తామన్నారు.

కానీ, పార్టీ వేదికలపై ధరణి పోర్టల్ గురించి చర్చించి, అధ్యయనం చేసి సంజయ్ అటువంటి ప్రకటన చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా నడ్డా సహితం ఎవ్వరో ఇచ్చిన ప్రసంగంను అప్పచెప్పిన్నట్లు ఉంది. ఏదేమైనా తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరేమి మాట్లాడినా సమస్య ఉండదులే అంటూ బిజెపి నేతలే అవహేళన చేస్తున్నారు.

మరోవంక, నాగర్ కర్నూల్ బహిరంగసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గైరాజరు కావడమే కాకుండా, పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు కూడా హాజరు కాలేదు. అయితే, రఘునందన్ రావు శంషాబాద్ లో ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

తెలంగాణాలో బిజెపికి ముగ్గురు ఎమ్యెల్యేలు ఉంటె, ఒక ఎమ్యెల్యే రాజా సింగ్ సస్పెన్షన్ లో ఉన్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్యెల్యేలు – ఈటెల రాజేందర్, రఘునందన్ రావు కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడి బహిరంగసభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles