తెలంగాణాలో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ దందాలు.. అమిత్ షాకు నివేదిక!

Wednesday, January 22, 2025

ఒక వంక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణాలో పార్టీ అభివృద్ధి కోసం రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ పడుతున్న కష్టాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సంజయ్ జరిపిన పాదయాత్ర ప్రభావం గురించి అన్ని రాష్ట్రాల నుండి యువమోర్చ నేతలను పంపి అధ్యయనం చేయడం కోసం పంపాలని సూచించారు.

మరోవంక, బీజేపీలో నం 2గా భావిస్తున్న హోమ్ మంత్రి అమిత్ షా చేతిలో పార్టీ వర్గాల నుండి కాకుండా, తెలంగాణ పోలీస్ నిఘా సమాచారం కూడా చేసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ తో కలసి తెలంగాణ బీజేపీలో మరెవ్వరిని ఎదగనీయకుండా, తామే అంతా అనే విధంగా వ్యవహరిస్తూ, పెద్ద పెద్ద కాంట్రాక్టుదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, పరిశ్రమల నుండి బెదిరించి పెద్ద మొత్తాలలో నిధులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

పైగా, తనకు మోదీ, అమిత్ షా మద్దతు ఉందని, మరెవ్వరితో పనిలేదంటూ పార్టీలో ఎవ్వరిని సంజయ్ లెక్కచేయడం లేదు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ వంటివారు ఫోనులు చేసినా స్పందించడంలేదని ఆయార్పణలు అమిత్ షాకు చేసినట్లు తెలిసింది.

వరుసగా ఎన్నికలలో గెలుస్తూ, విశేషమైన రాజకీయ ప్రభావం క్షేత్రస్థాయిలో గల తమను పార్టీలో ఎటువంటి పాత్రలేకుండా నిరాదరణకు గురిచేస్తున్నట్లు ఈటెల రాజేందర్, ఈ మధ్యనే బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితర సీనియర్ నేతలు సహితం ఫిర్యాదులు చేసిన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ బిజెపికి మరో ఇన్ ఛార్జ్ అయిన సునీల్ బన్సల్ ను కలసి అనేకమంది సీనియర్లు సంజయ్ పై ఆరోపణల చిట్టా విప్పిన్నట్లు తెలిసింది. దానిప్రభావమే అన్నట్లు గతవారం జరిగిన పార్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల సమావేశంలో తెలంగాణాలో `షో మాస్టర్లు’ ఎక్కువ అయ్యారని, ఎవ్వరు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా, తెలంగాణాలో ఒకొక్కనాయకుడు ఒకొక్క గ్రూప్ ను ప్రోత్సహిస్తూ పార్టీ కోసం మాత్రం పనిచేయడంలేదని కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణాలో అధికారంలోకి వచేస్తున్నామని అమిత్ షా, జెపి నడ్డా వంటి నేతలు తరచూ చెబుతూ ఉన్నప్పటికీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లు బన్సల్ కు అర్ధం అయిన్నట్లు చెబుతున్నారు.

ఇక తరుణ్ ఛుగ్ సహితం నిత్యం ఢిల్లీ నుండి తెలంగాణ రాజకీయాలపై ఏదో ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం మినహా ఇక్కడనేలకొన్న పరిస్థితులపై దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ నాయకులు ఎవ్వరైనా కలిసి సంజయ్ వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేస్తే అతనితో మాట్లాడతాలే అని తప్పించుకోవడం మినహా, పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

పైగా, ఢిల్లీలో సంజయ్ నాయకత్వంపై అతిశయోక్తులతో కూడిన నివేదికలు ఇస్తూ అతనికి అక్కడ `రక్షా కవచం’ మాదిరిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles