తాగుబోతోడు మాట పట్టుకొని తలనొప్పి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్

Wednesday, January 22, 2025

2024 ఎన్నికల్లో జనసేనకు ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు భారీ వ్యూహంతో పవన్ కళ్యాణ్ తలపెట్టిన `వారాహి విజయ యాత్ర’ మొదటి దశ తూర్పుగోదావరి జిల్లాలో  దారితప్పిందా? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్త్ర ప్రభుత్వ వైఫల్యాలు తెలియచెప్పే, తన పార్టీ విధానాలు వివరించడం ద్వారా రాజకీయ భూమిక ఏర్పాటుచేసుకొనే ప్రయత్నం చేయకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మొత్తం చర్చ పక్కదారి పట్టినట్లు అయింది.

ముఖ్యంగా కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని అవినీతి పరుడిగా పేర్కొనడంతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగడం, రాజకీయ మర్యాదలను పక్కనబెట్టి సినిమా డైలాగులా మాదిరిగా మాట్లాడటంతో బహిరంగసభలలో చప్పట్లు మారుమ్రోగినా, `సీఎం పవన్ .. సీఎం పవన్’ అంటూ నినాదాలతో ప్రతిధ్వనించినా ముఖ్యమంత్రి కావాలి అనుకొంటున్న ఓ నేత అటువంటి భాషను ప్రయోగించడాన్ని సాధారణ ప్రజానీకం  జీర్ణించుకోలేక పోతున్నట్లు స్పష్టం అవుతుంది.

కాపునేత ముద్రగడ పద్మనాభం ఉద్దేశ్యం ఏమైనా, ఆయనను ఎవరు ప్రోత్సహించినా `అటువంటి భాష ఉపయోగించడం భావ్యం కాదు’ అన్నందుకు జనసైనికులు దూషణలకు దిగడం, కాపుల ప్రయోజనాలను స్వార్థం కోసం పెడుతున్నారంటూ విమర్శలకు దిగి తీవ్రమైన అసహనం ప్రదర్శించారు. ఇటువంటి ఆగ్రవేశాలు తాత్కాలికంగా ప్రజాజీవనంలో `హీరో’ ఇమేజ్ కి ఉపయోగపడినా, సాధారణ ప్రజల మనస్సులను గెలుపొందలేరని గ్రహించాలి.

తాగుబోతు వాడి మాట పట్టుకొని వెళ్ళితే, పరాభవం తప్పదని చరిత్ర చెబుతుంది. రామాయణంలో తాగుబోతు తిప్పడు మాట శ్రీరాముడు వినడం వల్ల, సీత అడవికి వెళ్ళడం, లవకుశలు చేతిలో, రాముడు  ఓడిపోవడం  గురించి చరిత్ర చెబుతుంది. అలాగే కాకినాడ జిల్లా సర్పవరం వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్, తన ప్రక్కన ఉండే ఓ తాగుబోతు వాడి మాటలు విని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై సవాల్ కు దిగారనే ప్రచారం జరుగుతుంది.

ఆవేశంలో ద్వారంపూడిని కాకినాడ అర్బన్ లో ఓడిస్తానని సవాలువిసరడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడినుండి పోటీకి సిద్దపడతారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యూహాత్మకంగా ఆ మరుసటి రోజుననే  ద్వారంపూడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను పవన్ కళ్యాణ్ సవాలును స్వీకరిస్తున్నానని ప్రకటించడంతో జనసేన నాయకత్వం ఆత్మరక్షణలో పడింది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే, కాకినాడలో తనపై పోటి చేసి గెలవాలని ద్వారంపూడి సవాల్ చేయడం, పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటి చేస్తే పరాభవం తప్పదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుండటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇరకాట పరిస్థితిని సృష్టిస్తుంది. ముందూ- వెనుక చూడకుండా కాకినాడ నుండి పోటీచేయలేరు. పోటీ చేయకపోతే ఓటమి భయం వెంటాడుతోందని అవహేళన అధికార పార్టీ నేతల నుండి ఎదుర్కోవలసి వస్తుంది.

అసలు పవన్ కళ్యాణ్ తన ప్రక్కన ఉండే తాగుబోతుల మాట వినడం వలనే లేని పోని తలనొప్పులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఫాన్సు సహితం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పవన్ కు సలహాలు ఇస్తున్న ఆ తాగుబోతు ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతుంది. పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటి చేస్తాడా? లేదా? అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు సహితం దారితీస్తుంది. 
ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తూ, పార్టీలో మరెవ్వరికీ ప్రాధాన్యత లేకుండా, కనీసం మంచి, చేదు బేరీజు వేసుకొని సలహాలు ఇచ్చే బృందం అంటూ ప్రత్యేకంగా లేకపోవడంతో ఆయన ప్రసంగాలు  తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి.

ఒక వంక వైసిపి ప్రభుత్వ క్రిమినల్ ధోరణులను ఎండగడుతూ, మరోవంక జనసేన నాయకులు, కార్యకర్తల జోలికొచ్చే వైసీపీ నాయకులను ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి మరీ కొడతామంటూ మాట్లాడటం రాజకీయంగా జనసేన అధినేతతో లోపించిన పరిపక్వతకు వెల్లడి చేస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles