కాపు ముఖ్యమంత్రి …. ఏపీ కాపులను చీల్చడానికి కేసీఆర్ బ్రహ్మాస్త్రం!

Wednesday, January 22, 2025

తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలలో వరుసగా మూడోసారి తాను తెలుపొందే మార్గాలపట్లా కన్నా పొరుగున ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సీఎం వైఎస్ జగన్ ను ఆదుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తున్నది.

అందుకనే బిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు తెలంగాణకు అధ్యక్షుడు ఎవరిని నియమించలేదు గాని ముందుగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న కాపు నేతను ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

టిడిపి- జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తుండడంతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఆ రెండు పార్టీలు కలిస్తే ఎదురయ్యే ప్రభంజనంకు తట్టుకోవడం కష్టమని గ్రహిస్తున్నారు. ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా పవన్ ను చంద్రబాబు నాయుడుకు దూరం చేయలేకపోతున్నారు.

ఇప్పుడు కేసీఆర్ ను ఉపయోగించుకొని కాపునాయకులను పవన్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పలువురు కాపులకు బిఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చేనెల విశాఖపట్నంలో జరపదలచిన బహిరంగసభలో ఏపీకి కాపును ముఖ్యమంత్రిగా చేస్తామని కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్ధసారధిలతో హైదరాబాద్ లో ఏపీ కాపు నేతలు లక్ష్యంగా ఆ సామాజికవర్గపు సమావేశాన్ని ఏర్పాటు చేసి, టిడిపి, బిజెపి నేతలను ఆహ్వానించారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తో పాటుగా ఏపీకి చెందిన కాపు నేతలు హాజరయ్యారు.

ఈ సమావేశంలోనే కాపులకు కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వివరిస్తూ ఏపీలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాపును సీఎంగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తున్నది. అందుకనే కాపులందరూ కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు.

అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే తొలి ముఖ్యమంత్రి దళిత్ అని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత మాటమార్చడం అందరికి తెలిసిందే. అదేవిధంగా, ఇప్పుడు ప్రతిపక్షాల ఓట్లు చీల్చి, జగన్ తిరిగి గెలిచేటట్లు చేయడమే కేసీఆర్ లక్ష్యం గాని, టీఆర్ఎస్ నుండి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకునే సత్తా కేసీఆర్ కు ఏపీలో లేదని కూడా స్పష్టం.

గత ఎన్నికలలో జగన్ ను నమ్మి, గెలిపించి తీవ్రమైన అవమానాలకు గురవుతున్నామని ఇప్పటికే కాపు నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా ఉన్నారా అన్నది ప్రశ్న. కాపులకు కంచుకోటలుగా భావించే గోదావరి జిల్లాలో, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఓడించిన కాపులు ఇప్పటికే రాజకీయంగా భారీమూల్యం చెల్లించామని గ్రహిస్తున్నారు. మరోసారి అటువంటి పొరపాటు చేస్తారా? అనే సందేహం కలుగుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles