జర్నలిస్టులకు జగన్ ప్రభుత్వం భారీ షాక్

Thursday, March 28, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏవర్గం వారిని వదలకుండా, అందరికి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. వారిపై భారం మోపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతుండగా తాజాగా జర్నలిస్టుల వంతు వచ్చింది. రాష్ట్రంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు వృత్తి పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేయడంతో వారు గగ్గోలు పెడుతున్నారు.

అమలాపురంలో వివిధ పత్రికలు టీవీ చానెల్స్ లలో పనిచేస్తున్న 28 మంది విలేకరులకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి రూ. 2500 చొప్పున మొత్తం రూ. 12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

దీంతో నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్య పన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు.

కాగా గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు.

పక్క రాష్ట్ర సీఎం జర్నలిస్టులకు పక్క ఇళ్లు మంజూరు చేస్తూ వారికీ కావాల్సిన సదుపాయాలు అందిస్తుంటే, జగన్ మాత్రం ఇలా బాదుడు కార్యక్రమం పెట్టుకున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మధ్యనే విశాఖపట్నంలో రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికి ఇళ్లస్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడం ద్వారా వారిని మంచిచేసుకొనే ప్రయత్నం చేసిన జగన్, మరోవంక వారిని ఆర్ధికంగా వేధించడం మొదలుపెట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles