కర్నూల్ లో అవినాష్ అరెస్ట్ పై పోలీస్ – సిబిఐ దాగుడుమూతలు

Saturday, January 18, 2025

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిందే అంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులలో స్పష్టం చేయగా అందుకు అభ్యంతరం లేదని  ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేసినా సిబిఐ గత నెలరోజులుగా ముందడుగు వేయలేకపోవడం పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నది.

చివరకు సోమవారం అరెస్ట్ చేయవలసిందే అంటూ కర్నూలుకు చేరుకున్న సిబిఐ బృందం ఎస్పీ కృష్ణకాంత్ తో సుమారు ఎనిమిది గంటలసేపు మంతనాలు జరపటమే గాని, ఏపీ పోలీసుల నుండి తగు సహకారం అందకపోవడంతో నిస్తేజంగా కనిపించడం విస్మయం కలిగిస్తోంది. దీనిని అవకాశంగా తీసుకొని ముందస్తు బెయిల్ విషయమై అవినాష్ రెడ్డి సుప్రీకోర్టులో పిటీషన్ వేశారు. అది విచారణకు మంగళవారం విచారణకు  రానుంది.

ఈ లోగా హైదరాబాద్ నుండి కేంద్ర బలగాలను రప్పిస్తున్నామన్నారు. సాయంత్రంలోగా వస్తున్నట్లు తెలిపారు. మరోవంక, అవినాశ్ రెడ్డి అరెస్ట్‌కు సీబీఐ సన్నద్ధమవుతున్న వేళ హైకోర్ట్ వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారంపాటు సీబీఐ విచారణకు హాజరుకాకుండా మినహాయింపునివ్వాలని ఆయన అభ్యర్థించారు.

హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్‌ పిటిషన్‌ను వినేవరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అప్పటివరకు సీబీఐ ముందడుగు వేయడాన్ని అభిప్రాయం పలువురిలో కలుగుతుంది. సిబిఐ వ్రాతపూర్వకంగా అవినాష్ రెడ్డిని తమ ముందు లొంగిపోయే విధంగా చేయమని కోరినా, డిజిపి నుండి ఆదేశాలు రావలసిందే అంటూ ఎస్పీ దాటవేస్తున్నా సిబిఐ వేగంగా అడుగులు వేయకపోవడం గమనిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారం అంత అజరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరోవంక, తన తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరుకాలేకపోతున్నాని, ఈ నెల 27వ తేదీ వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ అధికారులను కోరుతూ అవినాష్ రెడ్డి తాజాగా లేఖ వ్రాసారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్న కారణంగా తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మినహాయింపు ఇవ్వాలని కోరారు. దర్యాప్తు సంస్థలు ఏవైనా సరే విచారణకు వచ్చిన్నప్పుడు కోర్టులో తేలేవరకు తనజోలికి రావద్దంటే వెనుకడుగు వేస్తాయా? కానీ ఇప్పుడు దాదాపు అదేవిధంగా జరుగుతుంది.

పైగా, ఆసుపత్రి ముందు వైసిపి కార్యకర్తలు భైటాయింపు జరుపుతూ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగనివ్వమని స్పష్టం చేస్తున్నారు. అయన తల్లి ఆరోగ్యం కుదుటపడి, ఆసుపత్రి నుండి బయటకు వచ్చే వరకు అరెస్ట్ జరిగితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అంటూ వైసిపి ఎమ్యెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి బహిరంగంగా సిబిఐని హెచ్చరిస్తున్నారు.

“నేను కొట్టినట్లు ఉండాలి…, నువ్వు ఏడ్చినట్లు ఉండాలి” అన్నట్లుగా వివేకా హత్య కేసులో సీబీఐ-అవినాష్ రెడ్డిల తీరు ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఓ హత్య కేసు నిందితుడి అరెస్టు కోసం సీబీఐ స్థానిక పోలీసులను బ్రతిమలాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఎస్పీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు చెప్పటం దుర్మార్గమని పేర్కొన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించలేమని పాలకులే ఒప్పుకుంటున్నప్పుడు ఇక ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చుగా? అని ఆయన ప్రశ్నించారు. ఏదేమైనా సోమవారం రాత్రిలోగా అవినాష్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకోనని పక్షంలో సిబిఐ నిస్సహాయంగా ఉందని, రాజకీయ వత్తిడుల కారణంగా ముందడుగు వేయలేకపోతోందని స్పష్టం అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles