ఎమ్యెల్యేల కొనుగోలుపై సిబిఐ దర్యాప్తు కేసీఆర్ మెడకు చుట్టుకొంటుందా!

Saturday, January 18, 2025

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ ను నిందితుడిగా చేసి, అరెస్ట్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పచెప్పడంతో ఈ కేసుకు అటుఇటు తిరిగి కేసీఆర్ మెడకు చుట్టుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి.  మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాగానే కేసీఆర్ ఈ కేసు వివరాలు, సీడిలను వెల్లడిస్తూ జరిపిన  ప్రెస్‌మీట్‌ కీలకంగా మారనున్నది. 

కేసుని తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలోని సిట్ నుండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐకి బదిలీ చేయడానికి హైకోర్టు 45  అంశాలను కారణాలుగా ప్రశాంతివస్తున్నప్పటికీ కేసీఆర్ జరిపిన మీడియా సమావేశాన్ని ప్రధాన కారణంగా పేర్కొనడంతో ఇప్పుడు సీబీఐ విచారణలో కేసీఆర్ సహితం కీలకంగా మారే అవకాశం ఉంది.

 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు చేరవేయటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్  ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చడం ద్వారా సిట్‌ ఉనికిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

“ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, మెటీరియల్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలా చేరాయి?” అని హైకోర్టు ప్రశ్నించింది. వీటిని ఎవరు, ఎప్పుడు, ఎలా అందజేశారన్న అంశం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని తెలిపింది.

 ‘‘ఏ చట్టం ప్రకారం, లేదా ఏ నిబంధనల ప్రకారం ఆధారాలు మొత్తం ముఖ్యమంత్రికి చేరాయో సిట్‌ గానీ, ప్రభుత్వం గానీ వివరించలేదు. దీని వెనుక ఉన్న థియరీ ఏమిటోతెలియదు. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డియే ఆధారాలను సీఎంకు ఇచ్చి ఉండవచ్చు అనే వాదనకు నిరూపణ లేదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఈ కేసులో ఫిర్యాదుదారుడైన తాండూర్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ విషయంలో కేసీఆర్ ను కాపాడటం కోసం తానే ఆ సమాచారం అంతా సీఎంకు ఇచ్చానని చెప్పిన్నప్పటికీ హైకోర్టు పరిగణలోకి తీసుకోవడం లేదు. అంత తక్కువ వ్యవధిలో ఫిర్యాదుదారుడికైనా అవన్నీ యెట్లా వచ్చాయి? అని నిలదీసింది. 

 అసలు.. డిఫ్యాక్టో కంప్లైనెంట్‌ అయిన రోహిత్‌రెడ్డికి ఏ దశలో, సీఆర్పీసీలోని ఏ సెక్షన్ల కింద ఆధారాలు మొత్తం అందజేశారో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలపలేదని హైకోర్టు పేర్కొంది. పైగా అంత తక్కువ సమయంలో ఆడియోలు, వీడియోలు వంటి పలు రకాల ఆధారాలను రోహిత్‌రెడ్డికి ఎలా అందజేశారో చెప్పలేదని తెలిపింది. 

పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్షుయాలులు ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో ఎలా ప్రత్యక్షమయ్యాయనే విషయంపై ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. ఎవిడెన్స్‌ మెటీరియల్‌ లీకేజీపై ప్రతివాదులు చాలా తెలివిగా వ్యూహాత్మక మౌనం పాటించారని పేర్కొంది. ఎవిడెన్స్‌లను ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు అన్ని రాష్ట్రాల చీఫ్‌ జస్టి్‌సలకు పంపించారని గుర్తు చేసింది. 

 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తీవ్ర నేరమైనప్పటికీ చట్టంలో పేర్కొన్న నిబంధనలు, ప్రొసీజర్‌ ఉల్లంఘనకు గురయ్యాయా, లేదా అన్న అంశాన్ని ప్రధానంగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, అయితే ఆధారాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టిన తీరు మాత్రం నిందితుల హక్కులకు భంగం కలిగించేదేనని తెలిపింది. 

ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఘటనలు క్రిమినల్‌ లా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరిగాయని కూడా నిర్ధారించింది. .దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పడం ద్వారా సిట్ పనితీరుపై ఆక్షేపణ వ్యక్తం చేసిన్నట్లయింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్‌ చేశారని హైకోర్టు మండిపడింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles