ఉత్తరాంధ్ర మంత్రుల్లో వణుకు… ఊహించని ప్రజావ్యతిరేకత

Thursday, December 19, 2024

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో అధికార వైసీపీ అభ్యర్థి దారుణమైన పరాజయం మూటగట్టుకొని అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ ప్రాంతంలోని వైసిపి మంత్రులు, ప్రజాప్రతినిధులతో వణుకు పుట్టుకొస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇంత దారుణంగా ఉందని కనీసం అంచనాకూడా వేయలేకపోయామని దిగ్బ్రాంతికి గురవుతున్నారు.

పైగా, బాలట్ పాత్రలతో పాటు మంత్రులు, వైసిపి నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ స్లిప్ లు కూడా ప్రత్యక్షమవడం వారిని మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నది. విశాఖపట్నంను రాజధానిగా చేస్తున్నామని, అక్కడకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకు వస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్న పార్టీకి ప్రజల నుండి ఇంతగా వ్యతిరేకత ఎదురుకావడం తట్టుకోలేక పోతున్నారు.

ఈ పరాజయం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ విధంగా ముఖం చూపించాలని మదనపడుతున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశమై తాము ఎన్నికల్లో ప్రయోగించిన అన్ని అస్త్రాలు ప్రభుత్వ వ్యతిరేకత ముందు విఫలం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

9 జిల్లాలు, 108 నియోజకవర్గాల్లో వచ్చిన ఎమ్యెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజల నాడి స్పష్టం అయ్యిందని, వైసీపీ ప్రభుత్వానికి మ్రోగుతున్న డేంజర్ బెల్స్ కనిపిస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. అయితే పార్టీకి బాగా పట్టు ఉన్నదనుకొంటున్న, ఏకపక్షంగా గెలుస్తామనుకొంటున్న రాయలసీమలో కూడా వ్యతిరేక ఓటు ఉన్నట్లు స్పష్టంగా కనిపించటం, చివరకు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా అనుకున్న స్థాయిలో వైసీపీకి అనుకూల ఓటింగ్ జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకొంటున్నారు.

ఒకవంక, ఎమ్యెల్సీ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలో జరుగుతూ ఉండగానే ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా విశాఖ లో పోస్టర్లు వెల్వడం వైసిపి నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ‘గో బ్యాక్ సీఎం సర్’.. ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఆంధ్రా యూనివర్సిటీ ప్రవేశద్వారం వద్ద, పలు కూడళ్లలో వెలిసాయి.

వీటిని ‘జన జాగరణ సమితి’ పేరుతో ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ శ్రేణులు వాటిని తొలగించేపనిలో పడ్డారు. రాజధాని విశాఖేనని, అక్కడి నుంచే త్వరలో పరిపాలన సాగిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు.ఏది ఏమైనా, 2019లో ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో టిడిపి నాలుగు సీట్లు గెలుచుకోవడం మినహా మిగిలిన చోట్ల వైసీపీ హవా కనిపించింది. చివరకు విశాఖపట్నం నుండి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమి చెందారు. అయితే ఈ సారి ఫలితాలు తారుమారు కావచ్చని ఎమ్యెల్సీ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన హెచ్చరికలు అధికార పక్షంకు పంపుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles