ఆడబిడ్డలకు రూ 15 వేలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.. టిడిపి మేనిఫెస్టో

Saturday, September 7, 2024

రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన పార్టీ మహానాడు ముగింపు సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో ‘భవిష్యత్ కు గ్యారంటీ’  పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఆరు కీలక పథకాలను పేర్కొన్నారు.

18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఒక్కొక్కరికి రూ 1500 చొప్పున ఏడాదికి రూ. 15 వేలు అకౌంట్లో జమ చేయనున్నామని వెల్లడించారు.  దీపం పధకం క్రింద ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులు అందరికి రూ 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వెల్లడించారు. ఈ మానిఫెస్టోలో ముఖ్యంగా ఆరు వాగ్ధానాలు చేశారు:

1. పేదలకు అండగా

1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం2. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2.  బీసీలకు రక్షణ చట్టం

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.

3. ఇంటింటికీ నీరు

చంద్రబాబుగారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం.

4.  అన్నదాత

ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి రూ. 15,000  ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

5.  మహాశక్తి

1.ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి “స్త్రీనిధి” కింద నెలకు రూ. 1500లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ‘తల్లికి వందనం’ పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

3.”దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

4.”ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

6. యువగళం

1. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంది.

2. ప్రతి నిరుద్యోగికి `యువగళం నిధి’ క్రింద నెలకు రూ 2,500 ఇస్తుంది.

‘‘జగన్‌ పేదల రక్తం తాగుతున్నారు. నకిలీ మద్యం, జేబ్రాండ్‌తో పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. జగన్, వైసీపీ నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేస్తాం. ఆ డబ్బును పేదలకు పంచుతాం. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం” అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

జగన్ అసమర్థతతో రాష్ట్రం అప్పులపాలైందని, జగన్ చేతకానితనం వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని,  రాష్ట్రంలో డగ్స్, గంజాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని ప్రజలు నమ్ముతున్నారని చెబుతూ జగన్‌ పనైపోయింది.. ఇక మళ్లీ ఇక రాడు.. రాలేడు అని స్పష్టం చేశారు. “మళ్లీ టీడీపీ అవసరం వచ్చింది.. సమయం లేదు మిత్రమా’’ అని చంద్రబాబు గర్జించారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles