మహానాడు నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు

Thursday, March 28, 2024

రాజమహేంద్రవరం రెండు రోజులపాటు జరిగిన టిడిపి మహానాడు వేదికగా 2024 ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కాపాడుకోడానికి ముందుంటామని చెబుతూ ఈ సందర్భంగా ఆరు పథకాలతో ప్రకటించిన పార్టీ ఎన్నికల ప్రణాళిక మొదటి దశ “భవిష్యత్తుకు గ్యారెంటీ” పార్టీ ఎన్నికల ఆయుధం అని వెల్లడించారు.

రాజమహేంద్రవరం సమీపంలోని వేమనగిరిలో టిడిపి మహానాడు రెండవ రోజు జరిగిన భారీ బహిరంగ సభ సందర్భంగా గాలివాన బీభత్సం సృష్టించినప్పటికీ కార్యకర్తలు, నేతలు చెదరిపోకుండా, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రాంగణంలోనే నిలిచి ఉండడంతో ఉత్సాహంగా “ఇక జగన్ పనైపోయింది” అని చంద్రబాబు ప్రకటించారు.

‘ఇప్పుడు మేమిచ్చిన హామీలతో పాటు ఇంకా మరేం చేయాలో.. సమాజంలోని ఇతర వర్గాలను ఎలా ఆదుకోవాలో ప్రజాక్షేత్రంలో చర్చిస్తాం. పూర్తి స్థాయి మేనిఫెస్టోను దసరాకు ప్రకటిస్తాం. పార్టీలోని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తా ఇంటింటికీ వెళ్లి మనం ఇచ్చిన హామీలను వివరించాలి. మీరు ప్రజల్లోకి వెళ్లడానికి ఆయుధాలిచ్చి పంపుతున్నా. ఇక పోరాటం మొదలుపెట్టండి. కురుక్షేత్ర యుద్ధానికి ఇక్కడే శంఖం పూరిస్తున్నా’ అని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు.

టిడిపిని అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తన మంచితనాన్నే చూశారని చెబుతూ రాజకీయ రౌడీలకు శిక్షవేసే బాధ్యత తనదేనని హెచ్చరించారు. మహానాడుకు ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడ్డారని, పోటీగా ఫ్లెక్సీలు పెట్టి వైసిపి చిల్లర రాజకీయాలకు పాల్పడిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడిపిని దెబ్బతీద్దామని ప్రయతిుంచిన ఎంతోమంది కాలగర్భంలో కలిసి పోయారని హెచ్చరించారు. టిడిపి కార్యకర్తలను వేధించిన వారినిఎక్కడున్నా వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. టిడిపి పేదల పార్టీ అని, వైసిపి ధనికుల పార్టీ అని పేర్కొంటూ రాష్ట్రంలో సహజ వనరులను జగన్‌ దోపిడీ చేస్తునాురని ఆరోపించారు.ధరల బాదుడుతో పేదలపై భారం మోపుతున్నారని, జగన్ పేదల రక్తం తాగుతున్నాడని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో పేదల ప్రాణాలతో ఆడకుంటున్నాడని విమర్శించారు.

“వైసీపీ ప్రభుత్వంలో దొంగలు, దోపిడీదారులు సహజ వనరులను, ప్రజాధనాన్ని అ యినకాడికి మెక్కారు. అలా మెక్కినదంతా మేమొస్తే కక్కిస్తాం. మద్యం దొంగలు, ఇసుక దొంగలు, కబ్జాకోర్లు, సెటిల్‌మెంట్‌ రౌడీలు సంపాదించినదంతా కక్కించి పేదలకు పెడతాం. అన్ని లెక్కలూ రాస్తున్నా” అని వెల్లడించారు. వైసిపి నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేస్తామని, ఆ డబ్బును పేదలకు పంచుతామని మాజీ ముఖ్యమంత్రి ప్రకటించారు.

జగన్ అసమర్థతతో రాష్ట్రం అప్పుల పాలయ్యిందని పేర్కొంటూ తను వేసిన ఫౌండేషన్ వల్లే ఇప్పుడు తెలంగాణకు భారీ ఆదాయం వస్తోందని చెప్పారు. జగన్ చేతకాని తనం వల్ల పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని వాపోయారు. జగన్‌ అసమర్థ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని తెలిపారు.

గతంలో ఉచితంగా దొరికిన ఇసుక ఇప్పుడేందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జె ట్యాక్స్‌ వల్ల పారిశ్రామికవేత్తలు, అప్పులతో రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల డబ్బు దోచేవారితో యుద్ధమని చెబుతూ దోచుకున్న వారి నుంచి కక్కించి పేదలకుదక్కేలా చేస్తామని స్పష్టం చేశారు.

వివేకా హత్యకుజగన్‌ సమాధానం చెప్పాలనిడిమాండ్‌ చేశారు. వందల కోట్ల రూపాయల ఆస్తి ఉను జగన్‌ పేదవాడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి టిడిపి అవసరం ఉందని పేర్కొంటూ ఎన్‌టిఆర్‌ పెట్టిన పార్టీనే రాష్ట్రాన్ని  కాపాడుతుందని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles