అవినాష్ రెడ్డి విషయంలో మసకబారుతున్న సీబీఐ ప్రతిష్ట

Saturday, January 18, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  కీలక నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని విచారించడంతో, అరెస్టు చేయడంలో  సిబిఐ చేస్తున్న తాత్సారం చేస్తుండటం కారణంగా ఆ సంస్థ ప్రతిష్ట మసకబారుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ముఖ్యంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కీలక నిందితుడిగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పేర్కొని, అతనిని అరెస్ట్ చేసేందుకు అడ్డంకులు లేవని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేసినా సిబిఐ వెనుకడుగు వేస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. సిబిఐలోని కొందరి సహకారంతోనే విచారణను ప్రతిసారీ ఏదోఒకసాకుతో  హాజరుకాకుండా తప్పించుకోగలుగు తున్నారని అభిప్రాయం బలపడుతుంది.

కడప ఎంపీ విచారణకు హాజరు కాకపోయినప్పటికీ ఆయన్ని అరెస్టు చేయకుండా, పదేపదే 160 నోటీసులు ఇవ్వడం  చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తమ్ముడైన అవినాష్ రెడ్డికి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తారా? అని నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. అవినాష్ రెడ్డికి కల్పించిన సౌకర్యాలనే సిబిఐ ఇతర
నిందితులందరికీ కల్పిస్తుందా? అంటూ నిలదీశారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  సిబిఐ అధికారులకు ఉన్న లావాదేవీల వల్ల  కేవలం ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రమే ఇటువంటి సౌకర్యాలను కల్పిస్తారా?? అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గతంలో తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సిఐడి పోలీసులు అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని, కానీ హత్య   కేసులో నిందితుడికి  పదేపదే నోటీసులు ఇస్తున్నారని గుర్తు చేశారు. 

సుప్రీంకోర్టులో సహితం అరెస్ట్ కు అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తర్వాత 20 రోజులపాటు మౌనంగా ఉన్న సిబిఐ అకస్మాత్తుగా ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. 16 ఉదయం విచారణకు బయలుదేరుతున్నట్లే ఉంటూ నాలుగు రోజులపాటు తనకు ముందనుకున్న కార్యక్రమాలు ఉన్నాయని, హాజరుకాలేనని అంటూ లేఖను పంపారు.

తిరిగి 19న హాజరుకమ్మనమని సిబిఐ నోటీసు పంపింది. 19 ఉదయం సిబిఐ కార్యాలయం వైపుకు వస్తున్నట్లే బయలుదేరి, పులివెందులలో తల్లి లక్ష్మమ్మ కళ్ళుతిరిగి పడిపోయి ఆసుపత్రిలో చేరిందని అంటూ, అటువైపు వెళ్లారు. వెనుక సిబిఐ రెండు వాహనాలలో వెంబడించిన లెక్కచేయలేదు. సాయంత్రం వరకు నాటకీయంగా జరిగిన సంఘటనల తర్వాత, కర్నూల్ లోని ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు.

తిరిగి తాజాగా, ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని సిబిఐ నోటీసు పంపింది. ఇదివరకు సహితం సిబిఐ నోటీసు ఇవ్వగానే ఎప్పుడూ విచారణకు హాజరుకాలేదు. ఏదో ఒక సాకుతో జాప్యం చేస్తూ వచ్చారు. .మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

సిబిఐ తాజా నోటీసులో సహితం 22న ఉదయం 10 గంటలకు అని కాకుండా 11 గంటలకు హాజరుకావాలని పేర్కొనడం అవినాష్ రెడ్డి మరేదో సాకుతో సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం కల్పించడం కోసమే అనే అభిప్రాయం బలంగా ఏర్పడుతున్నది. ఈ సారి ముందస్తు బెయిల్ అని కాకుండా తల్లి ఆరోగ్యం పేరుతో సంప్రదించి, మరో రెండు, మూడు రోజులు సీబీఐ విచారణను దాటవేసే అవకాశం లేకపోలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

72 ఏళ్ల వృద్ధుడైన  వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఇంటి వద్దకు వెళ్లి అరెస్టు చేసిన సిబిఐ అధికారులు, విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా హాజరుకాని అవినాష్ రెడ్డిని  అరెస్టు చేయకుండా , పదేపదే నోటీసులు  ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles