వివేకా హంతకులకు శిక్ష పడాల్సిందే… డా. సునీత స్పష్టం

Thursday, December 26, 2024

తన తండ్రి హత్య కేసులో నిజం తెలియాలనే ఉద్ధేశంతోనే తాను పోరాటం చేస్తున్నాని పేర్కొంటూ  వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతానని దివంగత మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాల్సిందే అని తేల్చి చెప్పారు. వివేకా హత్య కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని పేర్కొంటూ కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సునీత ఆరోపించారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించానని  ఆమె చెప్పారు.

అయితే, తన పోరాటం ఎవరి మీద కక్షతో చేస్తున్నది కాదని గమనించాలని ఆమె కోరారు. తప్పు చేసినవారికి శిక్షపడితేనే ఇలాంటివి జరగవని ఆమె పేర్కొన్నారు. కాగా, దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదని ఆమె పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విషయంలో ఎంతో మంది తెలియకుండానే సహకరిస్తున్నారని పేర్కొంటూ వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా  కుటుంబసభ్యులపై కూడా తాను ఆరోపణలు చేస్తున్నానని కూడా తెలుసని ఆమె చెప్పారు. ఈ హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నానని డా. సునీత వెల్లడించారు. పరోక్షంగా వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంభం ప్రమేయం గురించి ప్రస్తావిస్తూ తనకు తెలిసిన విషయాలను ఏనాడూ దాచలేదని ఆమె చెప్పారు.

జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ #JusticeForYSViveka అనే యాష్ టాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

విచారణ సందర్భంగా మాట్లాడటం సరికాదని అంటూ దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలని డా. సునీత కోరారు. తన తండ్రి హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారని, కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నట్లు చెప్పుకొచ్చారని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని డా. సునీత స్పష్టం చేశారు. ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని పేర్కొంటూ కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. తమకు తెలిసిన విషయాలను దర్యాప్తు సంస్థలకు చెప్పకపోవడం కూడా తప్పేనని అంటూ తన తండ్రి హత్య కేసు దర్యాప్తును ఎవరూ ప్రభావితం చేయొద్దని ఆమె కోరారు.

మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది.  నాలుగోసారి ఎంపీ అవినాష్ రెడ్డిని మంగళవారం నాలుగు గంటలకు పైగా సిబిఐ ప్రశ్నించింది. హత్య గురించి బాహ్యప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలిస్తే అంతకుముందే ఎంపీ అవినాష్‌ రెడ్డికి సమాచారం తెలిసిందనే ఆరోపణలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

హత్యాస్థలంలో రక్తపు మరకల్ని తుడిచేయడం.. మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి తరలించడం.. గుండెపోటుగా చిత్రీకరించడంలో అవినాష్‌ పాత్ర ఉందనే ఆరోపణలపై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles