పవన్ ను చూసి జడుసుకుంటున్న సర్కారు!

Sunday, March 3, 2024

జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో వారాహr యాత్ర నిర్వహిస్తున్నారంటే.. రుషికొండను సందర్శించడానికి ఆయన వెళుతున్నారంటే.. ప్రతి దశలోనూ ప్రభుత్వం వణుకుతోందా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. మరెవ్వరికీ లేనంత ఘోరంగా పవన్ కళ్యాణ్ కదలికల మీద ప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఆయనను నియంత్రించడానికి ప్రయత్నించడం గమనిస్తుంటే వారిలో ఆందోళన ఏ స్థాయిలో ఉన్నదోనని ప్రజలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే దోరణి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయానికి వస్తున్నారు.
వాలంటీర్ల ద్వారా ఎలాంటి తెరవెనుక కుట్రలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్నదనే విషయంలో పవన్ కల్యాణ్ సక్సెస్ ఫుల్ గా రాష్ట్ర ప్రజల్లో ఒక అవగాహన కలిగించగలిగారు. ప్రజల డేటా చౌర్యం ద్వారా.. వారి వ్యక్తిగత భద్రతకు హాని కలుగుతోందనే విషయం కేవలం పవన్ ద్వారా మాత్రమే ప్రజల్లోకి వెళ్లింది. అలా పవన్ మాటలంటేనే ప్రభుత్వం జడుసుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే.. ప్రస్తుతం విశాఖలో ఆయన వారాహియాత్ర సక్సెస్ కావడం ప్రభుత్వానికి మింగుడుపడలేదు. ఒకవైపు ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని’ అనే మాట ప్రజలపై సమ్మోహక అస్త్రం అని ప్రభుత్వం తలపోస్తుండగా.. అక్కడ రాజధానిని వ్యతిరేకిస్తూ, అమరావతి రాజధానిని సమర్థిస్తున్న పవన్ కల్యాణ్ కు విశాఖ ప్రజలు నీరాజనం పట్టడం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. ఆయన పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వెల్లడి కాకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
రుషికొండలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించడానికి పవన్ కల్యాణ్ వెళ్లాలంటే.. పోలీసులు బోలెడు ఆంక్షలు విధించారు రుషికొండను పూర్తిగా క్షవరం చేసేసి నిర్మిస్తున్న భవనాల్లో ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండబోతున్నారు అనే ప్రచారం కొంతకాలంగా ఉంది. వీటి సందర్శనకు పవన్ పై అనేక ఆంక్షలు పెట్టారు. కేవలం పది వాహనాలు మాత్రమే వెళ్లాలంటూ అనుమతి ఇచ్చారు. తీరా వెళ్లేప్పుడు అడుగడుగునా స్టాపర్లను ఏర్పాటుచేసి.. వాహనాల వెంట ఆయన అభిమానులు, నగర వాసులు ఎవ్వరూ వెళ్లకుండా ఆటంకాలు సృష్టించారు.
గతంలో సీపీఐ నాయకుడు నారాయణ ఇదే రుషికొండ నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. అధికారులే దగ్గరుండి ఆయనకు అన్ని నిర్మాణాలను చూపించడం.. ఏయే భవనం ఏయే అవసరాలకు నిర్మిస్తున్నామో కూడా ఆయనకు వివరించి చెప్పడం జరిగింది. పవన్ ను కనీసం భవనాల దగ్గరకు కూడా వెళ్లనివ్వలేదు. దూరం నుంచే చూడాలని అన్నారు. ఆయన వాహనం పైకి ఎక్కి భవనాలను పరిశీలించారు. జోడుగుళ్లపాలెం కూడలి వద్ద పవన్ కల్యాణ్ వాహనం దిగబోతే కూడా పోలీసులు అడ్డుకున్నారు. అంతగా భయపడుతున్నారంటే.. పవన్ ఫ్యాక్టర్ కు ప్రభుత్వం ఎంతగా జడుసుకుంటున్నదో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles