కవిత ప్రతి అడుగు భయ సంకేతమే!

Monday, February 26, 2024

మరొక్కసారి ఈడీ ఆపీసులో తాను అడుగు పెడితే చాలు అరెస్టు చేసేస్తారని కల్వకుంట్ల కవితకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఆమె అడుగుడుగునా అరెస్టు భయంతో గడుపుతున్నారు. కానీ తాజా పరిణామాలు ఏవీ ఆమెకు అంత అనుకూలంగా కనిపించడం లేదు. అరెస్టును తప్పించుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు అంతగా బలమైనవి కాదు. మహా అయితే అరెస్టు అనే వ్యవహారాన్ని రభస చేయగలరు తప్ప.. దానిని ఆమె తప్పించుకోవడం అసాధ్యం అని నిపుణులు భావిస్తున్నారు.
కల్వకుంట్ల కవిత గురువారం ఈడీ ఆఫీసుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆడవాళ్లను నేరుగా హాజరు కావాలని చెప్పకుండా మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. పైగా తన విచారణకు ఈడీ ఇచ్చిన నోటీసులనే రద్దు చేసేయాలనే డిమాండ్ తో ఆమె సుప్రీంలో కేసుకూడా వేశారు. ఇది కోర్టు ఎదుట నెగ్గే కేసు కాదు. నెగ్గడం ఆమె లక్ష్యం కూడా కాదు. సుప్రీం ఈ కేసును 24న విచారిస్తాం అని తెలిపింది. తను వేసిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది గనుక.. ప్రస్తుతానికి రాను అని కవిత ఈడీకి మెయిల్ పెట్టారు. అదే సమయంలో ఈడీ అడిగిన పత్రాలను తన లాయరు భరత్ ద్వారా పంపారు. 11న హాజరైనప్పుడు, 16న రావాలని నోటీసులు ఇచ్చిన ఈడీ, ‘వ్యక్తిగతంగా రమ్మని’ అందులో రాయలేదని ఆమె సాకు చూపించారు.
ఆమె తీసుకుంటున్న ప్రతి చర్య కూడా ఆమె అరెస్టు భయంతో వణికిపోతున్నట్టు నిరూపిస్తున్నాయి. అయితే ఈడీ దీనిని విడిచిపెట్టే ఉద్దేశంతో ఏమీ లేదు. ఇవాళ రాను అని మెయిల్ పెట్టిన తర్వాత.. ఈనెల 20 న రావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది. వ్యక్తిగతంగా రావాలని అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. సుప్రీం కోర్టు సీజే నిర్ణయం ప్రకారం ఆమె పిటిషన్ 24న విచారణకు వస్తుంది.
అయితే కవిత తరఫు న్యాయవాదులు.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా వినాలని సుప్రీంను శుక్రవారం ఆశ్రయించనున్నారు. ఇందులో తక్షణం వినవలసిన అవసరం ఏమున్నదో దేశానికి అర్థం కాని సంగతి.
అదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన కొన్ని విషయాలు గమనించాలి. సీబీఐ కేవలం దర్యాప్తు సంస్థ మాత్రమే. కానీ ఈడీకి క్వాసి జ్యుడిషియల్ అధికారాలు ఉంటాయి. అంటే కోర్టు లాంటిది అన్నమాట. సీబీఐను ఇంటికి వచ్చి విచారించమని అడిగే వెసులు బాటు ఉంటుంది. కానీ ఈడీని రమ్మనడం అంటే.. కోర్టును మా ఇంటికి వచ్చి విచారించమని అడగడం లాగా ఉంటుంది.
ఇవాళ ఈడీని మా ఇంటికొచ్చి విచారించండి అని అడుగుతున్న కవిత.. రేపు సుప్రీం కోర్టునైనా , నేను మహిళను గనుక మా ఇంటికొచ్చి విచారించండి’’ అని అడగదని గ్యారంటీ ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె కేసు అనేది కేవలం కాలయాపన మాత్రమేనని , అమె ప్రతి అడుగులో అరెస్టు భయం ఉన్నదని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles