ఎన్టీఆర్ శతజయంతికి తారక్ గైరాజర్!

Tuesday, May 21, 2024

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ దూరంగా ఉంటున్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని భారీ ఎత్తున జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, జూనియర్ ఎన్టీఆర్ గా పిలువబడే తారక్ గైరాజర్ కావడం రాజకీయ, సినిమా వర్గాలలో చర్చకు దారితీసింది.

గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఆయనను పిల్వడంలేదని సోషల్ మీడియాలో తారక్ అభిమానులు వాపోయారు. ఇప్పుడు స్వయంగా ఆహ్వానించినా హాజరుకాకపోవడం గమనిస్తే తారక్ కు నారా, నందమూరి కుటుంబాలతో ఏర్పడిన దూరం తగ్గే సూచనలు లేవని స్పష్టం అవుతుంది.

కుటుంభం సభ్యులతో జన్మదిన ఉత్సవం జరుపుకోవలసి ఉండడంతో హాజరు కాలేకపోతున్నట్లు తారక్ చెబుతున్న సమాధానం నమ్మశక్యంగా లేదని అందరూ భావిస్తున్నారు. తాతగారి రూపం పుణికిపుచ్చుకుని, ఆయనను దేవునితో సమానంగా ఆరాధించే తారక్ గైరాజర్ కావడానికి అదొక కారణం కాదని స్పష్టం అవుతుంది.

నిజంగా పాల్గొనాలనే ఆసక్తి ఉంటె కుటుంభం సభ్యులతో సంబరాలను సర్దుబాటు చేసుకొనేవాడని, కనీసం ఇక్కడకు వచ్చి కనిపించి వెళ్ళేవాడిని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు, ప్రత్యేక అతిథిగా నందమూరి బాలకృష్ణ పాల్గొనడమే తారక్ గైరాజర్ కు ప్రధాన కారణంగా పలువురు భావిస్తున్నారు.

పలు కారణాల చేత, ముఖ్యంగా జనం ముందు నారా లోకేష్ పలుచన అయ్యే అవకాశం ఉంటుందని  వారిద్దరూ ఉద్దేశపూర్వకంగా తారక్ ను కలుపుకోవడం లేదని, ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతుంది. మొదట్లో తారక్ పట్ల ఎంతో ఆత్మీయంగా ఉండే బాలకృష్ణ తదుపరి అల్లుడు రాజకీయ ప్రయోజనాలకోసం తారక్ ను దూరంగా నెట్టివేస్తూ వస్తున్నట్లు భావిస్తున్నారు.

వీరిద్దరి కారణంగా ఇతర కుటుంభం సభ్యులు సహితం తారక్ పట్ల ముభావంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందుకనే వారికి దూరంగా ఉండేందుకు తారక్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు కష్టపడి, సినీ పరిశ్రమలో `గాడ్ ఫాదర్’ అంటూ ఎవ్వరూ లేకుండానే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందే స్థాయికి ఎదిగిన తారక్ దానిని కాపాడుకోవడం పట్లనే ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.

నిజంగా ఈ కార్యక్రమంలో తారక్ పాల్గొనాలనుకుంటే బాలకృష్ణ ఒక ఫోన్ చేసినా వెళ్లి ఉండేవారని, ఆ విధంగా కాకుండా మర్యాదకోసం ఆహ్వానం పంపినట్లు చేశారని కూడా కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి, ఈ ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ మెట్రో పిల్లర్ల వెంట ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది.

అయినా ఈ ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో పలురకాల కథనాలకు ఆస్కారం ఏర్పడింది. కార్యక్రమానికి ముందుగానే హాజరు కావడం లేదని ఆయన పీఆరో బృందం ప్రకటన విడుదల చేసింది.

 “మే 20వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. తన 40వ జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకొంటున్నారు. ఈ రోజు కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం కోసం ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు” అని పేర్కొంది.

ఎన్టీఆర్ హాజరు కాకపోవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ కు, నారా ఫ్యామిలీకి మధ్య  విభేదాలున్నాయని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు ఈ పరిణామం బలం చేకూర్చినట్లయింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles