ముందు అది చేయాల్సిందే…తర్వాతే …అంటూ ముద్దుగుమ్మ షాకింగ్‌ కామెంట్స్‌!

Tuesday, January 21, 2025

టాలీవుడ్ లో దాస్‌ కా ధమ్మీ సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నటి నివేదా  పేతురాజ్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆ తర్వాత ఆ అమ్మడు మెంటల్ మదిలో, బ్రోచేవారేవరురా, పాగల్, అల వైకుంఠపురంలో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది.

అదేవిధంగా మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్‌లో ఆడుతూ కప్పులు కొడుతుంది. ఇక సినిమాలతో అంత గుర్తింపు రాకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మళ్ళింది. ఈ క్రమంలోనే ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అందరినీ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

గతంలోకి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు అని ఇంటర్వ్యూలో నివేతాని అడిగితే.. డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసుకోవాలి. ముందు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత డేటింగ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చింది .దీంతో.. అంటే మీకు పాస్ట్‌లో బ్యాడ్ అనుభవం ఉన్నట్టు ఉంది అని అడగగా.. నివేదా ఈ రోజుల్లో అందరూ లవ్, డేటింగ్ చేస్తున్నారు. సింగిల్‌గా ఉండటానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అని నవ్వుతూ అంది. దీంతో గతంలో నివేదా లవ్ ఫెయిల్యూర్ అని, ఎవరో ఆ అబ్బాయి అని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles