నిన్న అలా.. నేడు ఇలా.. వైసిపి వంకర మాటలు!

Thursday, January 23, 2025

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల హడావుడి ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున చూడాలి! రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగేసరికి.. వైసిపి నాయకులు మిఠాయిలు తినిపించుకుని పండగ చేసుకున్నారు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అసాధారణమైన సంక్షేమ పథకాలకు ప్రజలు ముగ్ధులైపోయి.. అలాంటి జగనన్న సర్కారు మళ్ళీ కావాలనే ఉద్దేశంతో ఎగబడి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారని వారు డప్పు కొట్టుకున్నారు. తమాషా ఏమిటంటే ప్రజల నాడిని కనీసంగా కూడా వారు గుర్తించలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు ఇదే మాయ మాటలు చెప్పుకుంటూ బతికారు. తీరా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగడం మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెరగడంపై తమ అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలంటూ అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం విశేషం.

ప్రజల తీర్పును గౌరవించాలనే మర్యాద తెలియని జగన్మోహన్ రెడ్డి ఫలితాల తర్వాత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు ప్రజలకు నవ్వు తెప్పించాయి. అవ్వ తాతల ప్రేమ ఏమైందో.. అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైందో అన్నటువంటి ఆయన మాటలు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. తాను పథకాలు ప్రవేశపెట్టింది కేవలం ఓట్ల కోసమే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ప్రేమ అంటే ఓట్లు వేయడమే అన్నట్టుగా తన బుద్ధి చూపించారు. ఏం జరిగిందో తెలియదు.. అంటూ పరోక్షంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఒంగోలు లో ఓడిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు ఈసీ అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించి మెషిన్లలో తేడా జరిగే అవకాశం లేదని నిరూపించారు. ఇప్పటికీ వైసిపి నాయకులు తెలివి తెచ్చుకోకుండా.. పోలింగ్ శాతం ఎక్కువ నమోదు కావడంపై అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.

సాధారణంగా ఎన్నికల అధికారి పోలింగ్ జరుగుతుండగా.. శాతాలు ప్రకటిస్తారు. అవి ఫైనల్ కాదని కూడా చెబుతారు. కచ్చితమైన శాతాలు మరురోజు చెబుతారు. ఇపుడు వైసిపి నాయకులు ఆ రెండు గణాంకాల మధ్య తేడా ఉన్నదని ఆరోపిస్తున్నారు. ఆ తేడా సహజం అని తెలిసినా.. గగ్గోలు పెడుతున్నారు. ఇవన్నీ ఓటమిని జీర్ణం చేసుకోలేని వారి వైఖరికి నిదర్శనాలు అని ప్రజలు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles