థియేటర్స్ లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా సినిమాల్లో రజినీకాంత్ హీరోగా నటించిన “కూలీ” ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోల సమ్మేళనం ఉండటంతో మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని చాలా మంది చెప్పుకున్నారు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా వసూళ్లతో రికార్డులు సృష్టించింది.
ఇక ఈ సినిమా పై వచ్చిన మిశ్రమ స్పందనలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన అభిప్రాయం స్పష్టంగా బయటపెట్టాడు. “కూలీ” గురించి ముందే చాలా మంది ఫ్యాన్స్, సినిమా లవర్స్ తమదైన లాజిక్ లు వేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తన “ఖైదీ, విక్రమ్, లియో” యూనివర్స్ కి కనెక్ట్ అవుతుందనే అభిప్రాయంతో థియేటర్స్ కి వెళ్లారని లోకేష్ చెప్పాడు. ఎక్కడైనా చివర్లో లింక్ వస్తుందేమో అని చాలామంది ఎదురు చూశారని కూడా గుర్తు చేశాడు.
అసలు విషయం ఏంటంటే, రజినీకాంత్ తో చేసిన ఈ చిత్రం పూర్తిగా స్టాండలోన్ ప్రాజెక్ట్ అని రిలీజ్ కి ముందే స్పష్టం చేశానని లోకేష్ చెబుతున్నాడు.
