వైసీపీ పార్టీ : అయితే బెయిలు లేకపోతే అజ్ఞాతం!

Monday, December 8, 2025

ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయి అసలు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? ఉండదా? అనే స్థాయిలో అగమ్యగోచరంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారసరళితో విసిగిపోయి, ఆయన నిర్వహణ శైలి వల్ల ఈ పార్టీ బతికి బట్టకట్టే అవకాధశమే లేదని నమ్ముతున్న అనేక మంది నాయకులు ఇప్పటికే పార్టీని వదలి వెళ్లిపోయారు. పార్టీలో ఎవరైనా నాయకులు మిగిలి ఉన్నారా అంటే వారందరూ కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి గత్యంతరం లేని వారు మాత్రమే. అయితే అంతకంటె దారుణమైన స్థితి ఏంటంటే.. వైసీపీ లో మిగిలిఉన్న నాయకులందరూ.. అయితే బెయిలుమీద బయట ఉన్నవారు.. లేకపోతే పరారీలో ఉన్నవారు మాత్రమే. మిగిలిన వారు ఎటూ జైళ్లలోనే గడుపుతున్నారు.  ఎలాంటి కేసులు, కళంకాలు లేకుండా  ఆ పార్టీలో ఉన్న నాయకులు చాలా కొద్ది మంది మాత్రమే. వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బెయిలు మీద పన్నెండేళ్లుగా బయటే ఉంటున్న వ్యక్తి కావడం విశేషం. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా.. జగన్ తీరులోనే ఆ పార్టీ నాయకుల్లో సగంమందికి పైగా బెయిలుమీదనే ఉన్నారు. రకరకాల కేసుల్లో ఇరుక్కున్న వారు.. బెయిలు తెచ్చుకుని గడుపుతున్నారు. కేవలం ఒక్క వివేకా హత్య కేసులోనే ఎంతమంది వైసీపీ ప్రముఖులు బెయిలుమీద ఉన్నారో అందరికీ తెలుసు. అరెస్టు అవుతామనే భయంలో బతుకుతున్న వారు.. బెయిలు రాదనే భయం ఇంకా ఎక్కువగా ఉన్నవారు.. ఏకంగా పరారైపోయారు. ఆ పరారైన వారి జాబితాలో కొత్తగా ఇంకో పేరు కూడా చేరింది. ఆయనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

పాపిరెడ్డి పల్లె సందర్శనకు వెళ్లినప్పుడు జగన్, తోపుదుర్తిని చాలా గొప్పగా కీర్తించారు. తీరా.. హెలిపాడ్ వద్ద.. పోలీసుల మీదకు రాళ్లు రువ్వించి, జనాన్ని రెచ్చగొట్టి దాడులు చేయించి.. నానారభస చేయించిన నాయకుడిగా తోపుదుర్తి పోలీసుల కేసుల్లోకి వెళ్లారు. నిజానికి హెలిపాడ్ వద్దకు జనాన్ని రానివ్వవొద్దని పోలీసులు ఆయనకు ముందే సమాచారం ఇచ్చినా కావాలని తరలించారు. అక్కడ జనంతో రచ్చ చేయించారు. పోలీసుల మీదనే దాడులు చేయించారు. తీరా పోలీసులు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదని, అందుకే హెలికాప్టర్ దెబ్బతిన్నదని ఎదురుదాడికి దిగారు. కానీ.. పోలీసుల ఫిర్యాదుతో ఆయనమీద కేసు నమోదు అయింది. అరెస్టు చేయడానికి వెళ్లేలోగా ఆయన పరారయ్యారు. ముందస్తు బెయిలుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.

ఆల్రెడీ మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తదితరులు పరారీలోనే ఉన్న సంగతి తెలిసిందే. రాజ్ కెసిరెడ్డి,  ఆయన అనుచరుడు పైలా ప్రదీప్ పరారు కాబోతూ దొరికిపోయిన సంగతి కూడా పాఠకులకు తెలిసిందే. సో, వైసీపీ పార్టీ నేతలందరూ దాదాపుగా ఒకటే స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles