అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి.. సన్నాహాలన్నీ సిద్ధం అయ్యాయి. ముహూర్తం కూడా ఖరారైంది. మే2వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ టెంకాయ కొట్టడం ఒక్కటే ఆలస్యం- పనులు అనూహ్యమైన వేగంతో జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము మరుభూమిగా మార్చేయదలచుకున్న అమరావతి కనులముందు సాక్షాత్కరించబోతోంటే… వైసీపీ వారికి జగన్ దళాలకు కడుపుమంటగా ఉంటోంది. ఏదో ఒక రకంగా ఈ పనులకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు సర్కారు.. అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ కూడా ఈ నగరానికి అదనపు హంగులుగా జతచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తుండగా.. అమరావతికి ఆల్రెడీ పొలాలు ఇచ్చిన రైతుల్లో కొత్త భయాలు పుట్టించడానికి కుటిలయత్నాలు చేశారు. అయితే మునిసిపల్ శాఖ మంత్రి, అమరావతి నిర్మాణ పనులన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ ఇచ్చిన క్లారిటీతో అమరావతి రైతుల్లో భయాలు తొలగి, భరోసా ఏర్పడుతోంది. అంతే కాదు.. కొత్త ఆలోచనలకు తగిన భూసేకరణ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వీలైనంత త్వరగా సవ్యంగా జరిగిపోవాలని వారు కూడా కలలు కంటున్నారు.
రైతుల్లో వైసీపీ దళాలు పుట్టిస్తున్న ఇలాంటి భయాలకు సంబంధించి.. మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చి తీరుతామని చెప్పిన మంత్రి.. కొందరు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం అంటే.. కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని.. ఇతరప్రాంతాలనుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడాలన్నా.. యువతకు ఉద్యోగాలు దొరకాలన్నా స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరం అని ఆయన పేర్కొన్నారు. జరుగుతున్న నిర్మాణ పనులు, మౌలిక వసతులకు సమాంతరంగా పరిశ్రమలు కూడా వస్తేనే రైతులకు కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లకు ధరలు పెరుగుతాయని ఆయన చెబుతున్నారు.
అమరావతి రాజధానిలో పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారని, దానికి తగినట్లుగా స్మార్ట్ పరిశ్రమలు రావాలని నారాయణ అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ స్థాయి సంస్థలు విరివిగా ఇక్కడకు రావాలంటే.. వారు విమానాశ్రయ అనుసంధానత కూడా చూస్తారని, అందుకోసమే గొప్ప విమానాశ్రయ నిర్మాణం కోసం అయిదువేల ఎకరాల స్థలం అన్వేషిస్తున్నట్టు తెలిపారు. భూసేకరణా? ల్యాండ్ పూలింగా? అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నరు.
ఏడాదిలోగా అధికార్ల నివాస భవనాలు, ఏడాదిన్నరలోగా ట్రంకు రోడ్లు, రెండున్నరేళ్లలోగా లేఅవుట్ రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని నారాయణ ఇస్తున్న హామీ.. అమరావతి రైతుల్లో భయాల్ని తొలగించి కొత్తఆశల్ని నింపుతోంది.
మంత్రి క్లారిటీతో వైసీపీ కుట్రలు పటాపంచలు!
Friday, December 5, 2025
