తన పార్టీ నాయకుల చావులో, లేదా తన కళ్లలో ఆనందం చూడడం కోసం పార్టీ నాయకులు అప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తూ ఇప్పుడు జైళ్లకు వెళ్లినప్పుడో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వారి ఊర్లకు వెళ్లి, లేదా వారు ఉంటున్న జైళ్లకు వెళ్లి పరామర్శించడం తప్ప.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కోసం పడుతున్న కష్టం ఏమీ లేదనే అభిప్రాయం పార్టీలో పలువురిలో ఉంది. దానికి తగ్గట్టుగానే.. ఆయన నిత్యం బెంగుళూరు యలహంకలోని ప్యాలెస్ లోనే గడుపుతూ.. ఏపీకి వచ్చినప్పుడు.. తన పరామర్శల మధ్య కాసింత గ్యాప్ ఉంటే.. కొన్ని గంటలు కొందరు నాయకులను పిలిపించుకుని వారితో మాట్లాడి.. కాసేపు చంద్రబాబును తిట్టేసి ఆ సమావేశాన్నిఅక్కడితో ముగిస్తున్నారు. అంతే తప్ప పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేయడడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆయన ఒక పిలుపు ఇస్తారే తప్ప తాను ఎన్నడూ స్వయంగా పాల్గొనడం లేదు. కార్యక్రమం అంతా అయిన తర్వాత ట్విటర్ లో అభినందనలు మాత్రం చెబుతారు. ఇలా అవకతవకగా తమ పార్టీ నిర్వహణ నడుస్తోందని వారే పెదవి విరుస్తూ ఉంటారు.
ఇలాంటి నేపథ్యంలో.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో పార్టీ పిలుపు ఇచ్చిన ఒక పసలేని కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంటింటికీ తీసుకువెళ్లాంటూ, ఆమేరకు పార్టీకి గైడెన్స్ ఇవ్వడానికి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తమాషా ఏంటంటే.. టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి కూడా జగన్ కు ఖాళీ లేదు. ఆ సమావేశాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డే నిర్వహించారు.
పార్టీ ఓడిపోయి ఏడాది అయింది. మరో నాలుగేళ్లలో ఆ పార్టీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అంతకంటె ముందు పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి. అయినా సరే.. ఇప్పటిదాకా పార్టీ కమిటీల ఏర్పాటు సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు పడనేలేదు. జగన్ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక యాత్ర ప్లాన్ చేసుకోవడం.. అక్కడకు పోలోమని జనాన్ని తరలించడం.. వారితో జేజేలు కొట్టించుకోవడం తప్ప పార్టీ సంస్థాగత నిర్మాణం మీద శ్రద్ధలేని పార్టీగానే ఇప్పటిదాకా సాగుతోంది. ఇలాటి సమయంలో దిశానిర్దేశం అనేది పార్టీ అధినేతి నుంచి రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ వైసీపీలో మాత్రం అలా జరగడం లేదువ. టెలికాన్ఫరెన్స్ కు కూడా జగన్ కు ఖాళీ లేకపోవడం వలన.. ఆ పనిని కూడా సజ్జల రామక్రిష్ణారెడ్డే చేస్తున్నారు.
ఆగస్టు నెలాఖరుకెల్లా గ్రామస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని, మండల స్థాయి నాయకులు క్రియాశీలంగా పనిచేయాలని సజ్జల హితవు చెబుతున్నారు. మండల లెవెల్లో బాబు వ్యతిరేక ప్రచార కార్యక్రమ సభలు పూర్తయిపోయాయి కాబట్టి.. ఇప్పుడు పార్టీ నాయకులు.. గ్రామస్థాయిలో కూడా విజయవంతం చేయాలని, గడపగడపకు తిరిగి చంద్రబాబు మోసాల గురించి తెలియజెప్పాలని ఆయన అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చిన చైతన్యం.. ప్రజల్లో పెరిగిన అవగాహన వారికి కనిపించడంలేదు. వైసీపీ నాయకులుగా ఇంటింటికీ తిరిగి చంద్రబాబును తిట్టడానికి పూనుకుంటాం సరే.. కానీ.. ప్తరి ఇంటిలోనూ లిక్కర్ స్కామ్ గురించి, ఇసుక కుంభకోణం గురించి వేల కోట్ల రూపాయలు కాజేసిన వైనం గురించి ప్రజలు అడిగితే ఏంచెప్పాలని క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు నిరాశపడుతున్నారు.
హవ్వ! టెలికాన్ఫరెన్స్ కు కూడా జగనన్నకు టైం లేదా..?
Monday, December 8, 2025
