భళా.. రేపటి తరానికి సంస్కారాలు నేర్పుతున్న చంద్రబాబు!

Friday, December 5, 2025

పేరెంట్ టీచర్స్ మీటింగులనేవి.. ఒక కార్యక్రమంగా పేరు లేకపోయినప్పటికీ.. పురాతన కాలంనుంచి గ్రామాల్లో కూడా జరుగుతూనే ఉండేవి. తల్లిదండ్రులు టీచర్లను కలుస్తూ, ఇంటికి పిలుస్తూ తమ పిల్లల చదువుసంధ్యల బాగోగులను తెలుసుకుంటూ ఉండేవారు. కాలక్రమంలో.. పేరెంట్ టీచర్స్ మీటింగులనేవి కేవలం ప్రెవేటు పాఠశాలలకు మాత్రమే పరిమితమైన వ్యవహారంగా మారింది. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలుకూడా ఇంప్లిమెంట్ చేశాయి. గత ప్రభుత్వంలో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగులు పెట్టాలనే ప్రయత్నాలను కొంత చేశారు. ఇలాంటి మీటింగులకు పేరు ఒకటే ఉంటుంది. కానీ.. అలాంటి వాటిని నిర్వహించడం ద్వారా..ఎవరెవరు ఎలాంటి లక్ష్యాలను ఆశిస్తున్నారు.. ఎలా తమ స్వార్థాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు అనేది రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కే స్థాయిలో రాష్ట్రమంతా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహించి.. ఆ సందర్భంగా తాను స్వయంగా పాల్గొని విద్యార్థులకు, సంస్కారాలను, బాధ్యతలను నేర్పడానికి ప్రయత్నించడం అభినందించదగ్గది.

గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పేరెంట్స్ మీట్ నిర్వహించడానికి పూనుకున్నారు. పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా.. అని దానికి ఒక ముసుగు తొడిగారు. ఉన్నత పాఠశాలల్లో అందరు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశం నిర్వహించాలనేది ప్లాన్. ఈ మీటింగుకు అందరినీ పిలిచి.. జగన్ ప్రభుత్వం మీ కుటుంబానికి ఇంత డబ్బులు ఇచ్చింది.. ఒక్కొక్కరికి ఇంతింత డబ్బులిచ్చాం.. ఈయీ రూపాల్లో ఇచ్చాం అంటూ వారికి మాటలు చెప్పి.. మొత్తానికి వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని ప్లాన్ వేశారు. అయిదే ఎన్నికల కోడ్ కారణంగా అది కార్యరూపం దాల్చలేదు.

అదే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే మెగా పేరంట్ టీచర్స్ మీట్ నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అక్కడి విద్యార్థులతో చాలా విలువైన సమయాన్ని గడిపారు. ఆయన పిల్లలతో మాట్లాడుతూ.. మీ అమ్మనాన్నలు మీ చదువుల కోసం ఎంత కష్టపడుతున్నారో గమనించండి. మీరు బాగా చదువుకోవాలి.. మీరు పెరిగిపెద్దయిన తర్వాత.. అమ్మానాన్నలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి. ప్రేమగా చూసుకోవాలి అంటూ మంచి మాటలు చెప్పారు.

ఈ రోజుల్లో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాలను నేర్పడం చాలా ముఖ్యం. కొత్తచెరువులోని స్కూలులో బడిలో పాఠం కూడా చెప్పిన చంద్రబాబు.. ఈ సంస్కారాలను నేర్పడం మీదనే దృష్టి పెట్టారు. పిల్లల తల్లిదండ్రులను కలవడం కూడా తమకు ఓట్లు పండించే కార్యక్రమం కావాల్సిన అవసరం లేదని.. పిల్లలు ఆ స్పృహతో బాగా చదువుకుంటేచాలునని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles