ప్రభాస్ తెలియనే తెలియదంటే నమ్ముతారా?

Monday, December 23, 2024
చాలాకాలంగా ప్రజల్లో నానుతున్న ఒక పుకారు మళ్లీ తెరపైకి వచ్చింది. స్వయంగా బాధితురాలే ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సినీ నటుడు ప్రభాస్ తో వైఎస్ షర్మిలకు సంబంధం ఉందనే ప్రచారం చాలాకాలంగా ఉంది. గతంలో ఈ ప్రచారాన్ని షర్మిల ఖండించారు. ఎన్‌బీకే టవర్స్ నుంచే ఈ విషప్రచారం జరిగిందని, బాలకృష్ణకు కూడా తన మీద జరిగిన ఈ తప్పుడు ప్రచారంతో సంబంధం ఉంటుందని భావిస్తున్నట్టు గతంలో వైఎస్ షర్మిల గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అయితే అప్పటి ఇంటర్వ్యూను వాడుకుని.. తెలుగుదేశాన్ని నిందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడాన్ని షర్మిల ఒక రేంజిలో విమర్శించారు.

నీకు అంతగా చెల్లెలి మీద ప్రేమ ఉంటే.. అప్పట్లో ఆ కేసు తెరపైకి వచ్చినప్పుడు.. నీ తరఫున నువ్వేం చర్యలు తీసుకున్నావు.. అంటూ అన్న జగన్ ను సూటిగా ప్రశ్నించారు షర్మిల. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను ప్రెస్ మీట్ లో చూపించి.. అది కూడా తనకు ఎడ్వాంటేజీగా వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన ప్రచారం చేస్తున్నారంటూ దెప్పిపొడిచారు. తన మీద జరిగిన తప్పుడు ప్రచారానికి సంబంధించి.. ఇన్నేళ్ల తర్వాత.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయడానికి జగన్ కు ఏం నైతిక  హక్కు ఉన్నదని షర్మిల ప్రశ్నిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన మీద అలాంటి ప్రచారం జరిగితే జగన్ పట్టించుకోలేదని, అంతగా చెల్లెలి మీద ఆయనకు ప్రేమ ఉంటే ఎందుకు అలా చేశారని ఆమె అడుగుతున్నారు. హీరో ప్రభాస్ ను తాను అసలు ఎప్పుడూ చూడనే చూడలేదని.. అసలు ప్రభాస్ ఎవ్వరూ తనకు తెలియనే తెలియదని కూడా షర్మిల చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఎంత అవకాశవాది అనేది షర్మిల మాటల్లో చక్కగా నిరూపణ అవుతోంది. షర్మిల ఇలాంటి తప్పుడు అసభ్య పోస్టులకు బలైన రోజున ఆయన ఆమెకు అండగా ఉండలేకపోయారు. అన్నగా అండగా ఉండడం సంగతి తరువాత.. కనీసం ఒక మహిళపై అలాంటి పోస్టులు వస్తే.. వాటిపై చర్యలు తీసుకోవడానికి తన తరఫున నామమాత్రంగా కూడా పూనిక తీసుకోలేదు. అలాంటిది అదే వ్యవహారాన్ని ఇప్పుడు తన మైలేజీ కోసం వాడుకుంటున్నారు. ఇంతకంటె లేకితనం మరొకటి ఉంటుందా అని ప్రజలు అనుకుంటున్నారు. షర్మిల కూడా అన్నయ్య ధోరణిని అదే స్థాయిలో ఎండగట్టడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles