ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టే విషయంలోనూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో అరాచకంగా వ్యవహరించిందనే సంగతి అందరికీ తెలుసు. పేదవాడికి అయిదురూపాయలకు అన్నం పెట్టే పథకాన్ని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దేచేసేసి.. ఆకలితో అలమటించే పేదల ఉసురుపోసుకున్నారు. అలాగే.. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వర్తించే మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ రద్దుచేసేశారు. అయితే జగన్ అయిదేళ్లలో చేసిన పాపాలను ఒక్కటొక్కటిగా చక్కదిద్దుతున్న చంద్రబాబునాయుడు సర్కారు.. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తిరిగి ప్రారంభించబోతోంది. తెలుగునేలపై అన్నదానాలకు ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ పేరుతో ఈ పథకం అమల్లోకి రానుంది.
జగన్ ప్రజలకు డబ్బులు పంచి పెడితే చాలు.. బిస్కట్లు విసిరినట్టుగా డబ్బులు వేస్తూ ఉంటే.. వారు తనకు ఎప్పటికీ రుణపడి ఉంటారు.. తన పార్టీకి శాశ్వతమైన ఓటుబ్యాంకుగా తయారవుతారు.. అనే భ్రమల్లో అయిదేళ్ల పరిపాలన సాగించారు. డబ్బులు పంచిపెట్టడం తప్ప మరే ఇతర సంక్షేమ పని అభివృద్ధి పని చేయకుండా నీరో చక్రవర్తిలా వ్యవహరించారు. చివరికి ఇంటర్మీడియట్ పిల్లలకు మద్యాహ్నభోజన పథకాన్ని కూడా ఆయన రద్దుచేసేశారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో 475 జూేనియర్ కాలేజీలు ఉండగా.. వాటిలో 300 వరకు ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లోనే ఉన్నాయి. ఆయా స్కూళ్లలో వండే వారితోనే ఇంటర్ విద్యార్థులకుకూడా వండించి పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన 175 కాలేజీల వారికి సమీపంలోని పాఠశాలలనుంచి పంపే ఏర్పాటు చేయబోతున్నారు.
డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 1.41 లక్షల మంది విద్యార్తులకు లబ్ధి జరుగుతుంది. జగన్ అధికారంలోకి రాక ముందు వరకు చంద్రబాబు పాలన కాలంలో ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండేది. జగన్ గద్దె ఎక్కిన తర్వాత.. అన్న క్యాంటీన్లను ఎత్తివేసి పేదల కడుపు కొట్టినట్టే.. ఈ పథకాన్ని కూడా తొలగించి.. విద్యార్థుల కడుపుకొట్టారు.అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇస్తున్నాం గనుక.. రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు జగన్ తప్పులు దిద్దే క్రమంలో చంద్రబాబు మళ్లీ ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
డొక్కా సీతమ్మ పథకంతో.. చంద్రబాబుకు యూత్‌లో క్రేజ్!
Thursday, December 19, 2024