తన పార్టీకి చెందిన గూండాలందరూ కూడా, తన అనుచరులందరూ కూడా శుద్ధపూసలని, నోట్లో వేలే పెడితే కొరకడం కూడా వారికి తెలియదని.. పాపం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమయాకంగా చెబుతూ ఉంటారు. ఎంతో మంచివాళ్లయిన తన తమ్ముళ్లను.. కూటమి ప్రభుత్వం వేధిస్తున్నదని కపటప్రేమను చూపిస్తుంటారు. పోలీసులు వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఆడిపోసుకుంటూ బతుకుతుంటారు. పోలీసులకు బట్టలూడదీయించి రోడ్లలో నిలబెడతానని.. తన సైకోబుద్ధిని ప్రదర్శిస్తుంటారు. ఆయన పోలీసుల బట్టలూడ దీయిస్తానని అంటూ ఉండగా.. ఆయన తమ్ముళ్లు.. అదే సైకోపార్టీ కార్యకర్తలు.. సామాన్య ప్రజల బట్టలు ఊడదీసి తమ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. కేవలం బట్టలూడదీయించడం మాత్రమే కాదు.. వారి వద్ద ఉన్న డబ్బు కూడా దోచుకుని.. దారుణంగా దాడిచేసి కొట్టి ఆస్పత్రి పాల్జేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఇలాంటి దురాగతాలు అనేకం జరిగాయి. ఇప్పుడు కూడా జగన్ కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా వైసీపీ గూండాలు అదే దురుసుతనం ప్రదర్శిస్తున్నారు. విజయవాడ సమీపం పెనమలూరులో ఓ బిజెపి కార్యకర్తపై వైసీపీ గూండాలు దాష్టీకం ప్రదర్శించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
పెనమలూరులో ఒక బిజెపి కార్యకర్తను వైసీపీకి చెందిన గూండాలు పట్టుకుని.. ‘జై జగన్’ అనాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అతను బిజెపి కార్యకర్త కావడంతో.. ఆ మాట అనడానికి నిరాకరించారు. వారు ఊరుకోలేదు. అతడిమీద దాడిచేసి కొట్టారు. అతనితో బట్టలూడదీయించి నిలబెట్టారు. ఫోనుతో పాటు, అతని వద్ద ఉన్న మూడువేల రూపాయలను కూడా లాక్కున్నారు. గాయపడి ఆస్పత్రిపాలైన బాధితుడు.. తాజాగా మంగళవారం నాడు పెనమలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వైసీపీ గూండాలు గంగాధర్, బొర్రా వెంకట్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు చెప్పాడు. పోలీసులు నిందితుల కోసం గాలించగా వారు ఆల్రెడీ పరారైనట్టుగా తెలిసింది. బాధితుడిమీద దాడి జరిగిందని, నిందితులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి బట్టలూడదీయించే దుర్మార్గాలకు పాల్పడడం వైసీపీ గూండాలకు ఇది కొత్త కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఉత్తరాంధ్ర నుంచి సైకిలుయాత్ర చేస్తూ కుప్పం వెళుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పుంగనూరులో వైసీపీ గూండాలు అడ్డగించారు. వారితో బలవంతంగా బట్టలూడదీయించి.. అవమానించి వెనక్కు పంపారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలే.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. పోలీసులు వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
జై జగన్ అనకుంటే బట్టలూడదీయిస్తారా?
Friday, December 5, 2025
