ఉదయనిధి జవాబు చేప్తాడా!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఓ మీటింగ్ లో సనాతన ధర్మం విషయంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. అలాగే ఇదే మీటింగ్ లో మన పక్క స్టేట్ తమిళనాడుకి చెందిన ప్రముఖ హీరో అలాగే పవన్ లానే అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారి తీశాయి.

ఉదయ్‌ కి తమిళ్ లోనే పవన్ ఘాటుగా వార్నింగ్ ఇవ్వగా అటు హీరోలుగా,  డిప్యూటీ సీఎంలుగా ఉన్న వీరు చేసిన వ్యాఖ్యలు ఎవరూ ఊహించి ఉండరు. మరి పవన్ తన సైడ్ నుంచి ఉదయనిధికి సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై ఉదయనిధి ఏమన్నా కౌంటర్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఇస్తే ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది కూడా సోషల్ మీడియా ప్రజానికానికి మరింత ఇంట్రెస్టింగ్ అంశంగా అయ్యింది. మరి పవన్ విషయంలో కోలీవుడ్ హీరో ఏమంటాడో, ఎలాంటి కౌంటర్‌ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

Share This Article