అరెస్టులకు సుప్రీం పచ్చ జెండా ఎత్తుతుందా

Monday, October 21, 2024

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించిన నాయకులలో మళ్లీ ఇప్పుడు అరెస్టు భయం ప్రవేశించింది. కోర్టు ద్వారా అరెస్టునుంచి రక్షణ పొందిన వారికి తమ తలరాత తిరగబడుతుందేమోనని భయంగా ఉంది. ముందస్తు బెయలు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు కానీ వారి పాచికలు ఫలించలేదు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మాత్రమే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిం.ది అయితే వారు పోలీసు విచారణకు సహకరించాలని ఇది కూడా సుప్రీంకోర్టు నిర్దేశించిన విషయం విదితమే. ఈ కేసులో విచారణ ఎలా సాగుతూ వచ్చిందో.. పోలీసుల ప్రశ్నలకు నాయకులు ఎలాంటి తలాతోకాలేని సమాధానాలు చెబుతూ వచ్చారో.. ప్రజలందరూ గమనించారు! ఈ కేసు విచారణలో దేవినేని అవినాష్,  మాజీ మంత్రి జోగి రమేష్ తప్ప మిగిలిన ఎవరూ కూడా విచారణకు సహకరించడం లేదంటూ ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.  దీని పర్యవసానంగా విచారణకు సహకరించని నాయకులను అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఎత్తే అవకాశం ఉంది. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం తదితరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసును పోలీసులు తిరిగి విచారణ ప్రారంభించిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ముందస్తు బెయిలు పిటిషన్లను హైకోర్టులో తిరస్కరణకు గురైన తరువాత కేవలం అరెస్ట్ నుంచి రక్షణ మాత్రమే వారికి లభించింది. అయితే వారు విచారణకు తప్పకుండా సహకరించాలని ఖచ్చితమైన నిబంధన ఉంది. విచారణలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా- ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. వంటి సమాధానాలు చెబుతూ, కామెడీ ఎపిసోడ్ ను తలపించారు. మీ ఫోన్లు ఇవ్వాలని పోలీసులు అడిగితే.. ఫోన్లు ఇవ్వాల్సిన అవసరమే లేదని ఫోన్లు అడిగే హక్కు మీకు లేదని సంఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటికి నాలుగైదు రకాల ఫోన్లు మార్చాం.. అప్పుడు వాడిన ఫోన్ ఎవరికిచ్చామో తెలియదు… అని రకరకాల కల్లబొల్లి కబుర్లతో విచారణ అధికారులను మాయ చేయడానికి ప్రయత్నించారు. వారికి అరెస్టు నుంచి కోర్టు రక్షణ కూడా ఉన్నది కనుక కేవలం ప్రశ్నించి వారు చెప్పిన సమాధానాలను మాత్రమే పోలీసులు నమోదు చేసుకున్నారు అయితే ఇప్పుడు దేవినేని అవినాష్, జోగి రమేష్ మినహా మిగిలిన వారు విచారణకు సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టులో కోర్టుకు నివేదించడం కీలక చర్చనీచాంశంగా ఉంది. ఇది నిజమని తేలితే ఒక రకంగా వారు కోర్టు  ఆదేశాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ విషయంపై సుప్రీం ధర్మాసనం ఎంత మేరకు సీరియస్ అవుతుందో తెలియదు. లేళ్ల అప్పిరెడ్డి తలశిల రఘురాం తదితరులు అరెస్టు అయ్యే ప్రమాదం ఉంది. నిజానికి బెయిలు పిటిషన్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడే వీరిలో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్టు నుంచి రక్షణ దక్కిన తర్వాత మాత్రమే బయటకు వచ్చారు. ఇప్పుడు సుప్రీం గనుక వీరి అరెస్టులకు పచ్చ జెండా ఊపితే మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా? లే,దా పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించి మరోసారి బెయిలుకు దరఖాస్తు చేసుకొని పరువు కాపాడుకుంటారా అనేది వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles