ముద్రగడ పద్మనాభం అపరిమితమైన ఫ్రస్ట్రేషన్ లో రగిలిపోతున్నారు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆయనను కరివేపాకు కంటే ఘోరంగా వాడుకుంటున్నారు. రాజకీయంగా భవిష్యత్తు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. చూడబోతే.. చివరినిమిషంలో జగన్ ను నమ్ముకుని.. ఆయనేదో తన నెత్తిన కిరీటం పెడతారని అనుకుంటే.. ఇప్పుడు ఆయన పరిస్తితే అగమ్యగోచరంగా ఉంది. ‘నా కాపు జాతి’ అంటూ కొన్ని సంవత్సరాలుగా కురిపించిన మాటల వ్యవహారం అంతా మంటగలిసిపోయింది. ఇప్పడు ఆయన ఎవరి కారణంగానో కలిగిన ఫ్రస్ట్రేషన్ ను, ఎవరిమీదనో ఉన్న కోపాన్ని వేరెవ్వరిమీదనో కక్కే చవకబారు రాజకీయనాయకుడిగా హఠాత్తుగా మారిపోయారు.
ముద్రగడ కూతురు ఇటీవల మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించడానికి తాను కృషిచేస్తానని చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సభకు ఆమె హాజరై తమ దంపతులు జనసేనలో చేరుతాం అని అడిగారు. అయితే.. పవన్ కల్యాణ్ వారి చేరికను సున్నితంగా తిరస్కరించారు.
నేను పార్టీలనే కలుపుతున్న వ్యక్తిని, కుటుంబాలను విడదీస్తానా? మీరు కావాలంటే నన్ను మీ ఇంటికి ఆహ్వానించండి.. మీ నాన్న ముద్రగడతో కలిసి అందరినీ పార్టీలో చేర్చుకుంటా అని పవన్ కల్యాణ్ చాలా హుందాగా ప్రకటించారు. అంతే తప్ప ఆమెను, భర్తను పార్టీలో చేర్చుకుని.. వారి ద్వారా.. ముద్రగడ మీద బురద చల్లించి.. ముద్రగడకు సొంత కూతురివద్దనే విలువలేదు. అలాంటి వాడిని కాపు జాతి గౌరవిస్తుందా.. అంటూ అతి డైలాగులు పలకడానికి ఉత్సాహం చూపించలేదు. ఆమెను పార్టీలో చేర్చుకోకుండా పవన్ కల్యాణ్ చాలా హుందాగా ఆ వ్యవహారాన్ని డీల్ చేశారు.
అయితే అంత మర్యాదగా పవన్ ప్రవర్తించడాన్ని కూడా ముద్రగడ సహించలేకపోతున్నారు. ఏ రోజైతే.. ‘ముద్రగడను పవన్ ను తిట్టడానికి తప్ప మరో పనికి జగన్ వాడడం లేదని’ కూతురు సీక్రెట్ బయటపెట్టి జాలి చూపించిందో ఆనాడే ఆయన పరువు పోయింది. ఆమె పవన్ పార్టీలో చేరడానికి వెళ్లడంతో ఆయన ఇంకా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన కూతురు వేదిక మీదకు వెళ్లడాన్నే ఆయన తప్పులాగా మాట్లాడుతున్నారు. ‘‘నా కూతురును వేదికమీద ఉంచి పరిచయం చేస్తావా.. అలాగే నీ ముగ్గురు భార్యలను కూడా పరిచయం చేస్తావా. నిన్ను వదిలేసిన ఇద్దరు భార్యలను కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తావా? నీ మూడో భార్యను కూడా తెచ్చి పరిచయం చేస్తావా’’ అంటూ అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. కూతురు కొట్టిన దెబ్బకు ముద్రగడకు మైండ్ బ్లాక్ అయి మతి చలించిందేమోనని.. పవన్ కల్యాణ్ హుందాతనాన్ని అర్థం చేసుకోకుండా.. ఆయన మీద నీచమైన వ్యాఖ్యలుచేస్తున్నారని, కాపుల్లో ఉండే గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటారని పలువురు అంటున్నారు.
జాతినేత మరీ ఇంత లేకిగా, చీప్ గా మాట్లాడతారా?
Wednesday, January 22, 2025