దొంగలు మింగిన దేవుడి భూములు లెక్క తేలుతాయా?

Friday, November 22, 2024

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో విచ్చలవిడిగా అక్రమాలు అన్ని రంగాలలోనూ జరిగాయని సంగతి ప్రజలు గుర్తించారు. అరాచక పర్వంలో వారి స్వైర విహారం అందరికీ అర్థమైంది గనుకనే ఆ స్థాయిలో పార్టీ ఓడిపోయింది. తీరా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి అక్రమాలను ఒక్కటి ఒక్కటిగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రత్యేకించి వందల వేల కోట్ల రూపాయల విలువైన ఆలయ భూములు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఏమేరకు అన్యాక్రాంతం అయ్యాయో లెక్క తీసే పనిలో ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్లో తాజాగా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ భూముల పరిరక్షణ విషయంలో గట్టిపట్టుదలతో, కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సచివాలయంలో తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తిరుమల నుంచి అరసవెల్లి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకు సంబంధించిన వందల వేల ఎకరాలు భూములు అన్యాక్రాంతం అయి ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇదమిత్థంగా వాటి లెక్క మాత్రం ఇంకా తేలినట్లు లేదు. అయితే తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది మాత్రం లేదని ఆనం నారాయణరెడ్డి స్పష్టం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాల్లో తప్పులు జరిగినట్లు నిర్ధారించి ఐదుగురు అధికారులను ఆల్రెడీ సస్పెండ్ చేశామని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరాచక శక్తులు కబ్జా చేయడంలో సహకరించిన అధికారులందరికీ కూడా ఇప్పుడు అరదండాలు పడే ప్రమాదం కనిపిస్తోంది.

అన్యాక్రాంతమైన ఆలయ భూములను తిరిగి పరిరక్షించడం కొత్త ప్రభుత్వం ముందున్న ఒక ప్రధాన కర్తవ్యం. అది మాత్రమే కాకుండా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలు కూడా ప్రజల ఆమోదాన్ని పొందుతున్నాయి. కొన్ని దేవాలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లుగా మంత్రి చెబుతున్నారు. అలాగే 50 వేల కంటే తక్కువ ఆదాయం ఉండే దేవస్థానాలకు వరకు ధూప దీప నైవేద్యాలు నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం  తీసుకోవడం కూడా ప్రజల అభినందనలకు పాత్రమవుతోంది. దీనివలన దేవాదాయ శాఖపై అదనంగా 32 కోట్ల భారం పడుతుందని మంత్రి చెబుతున్నారు. ఈ చర్యలతో పాటు గోదావరి కృష్ణా నదులను అనుసంధానించిన చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జల హారతి కార్యక్రమాన్ని తిరిగి కొత్త ప్రభుత్వం కొనసాగించనుందని మంత్రి వెల్లడించారు కూడా. ఏది ఏమైనప్పటికీ.. అన్యాక్రాంతమైన ఆలయ భూములను  తిరిగి కాపాడడం అనేది ధర్మ పరిరక్షణకు గొప్ప మేలు అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles