వైఎస్ భారతిపై కూడా కేసు నమోదు అవుతుందా?

Sunday, December 22, 2024

తీగ లాగితే డొంక మొత్తం కదలబోతోందా? చిన్న చేపల కోసం వల విసిరితే పెద్ద తిమింగలాలే పడబోతున్నాయా? సోషల్ మీడియా పోస్టుల వెనుక ఎంత పెద్ద తాడేపల్లి తిమింగలాలు ఉన్నా వదిలిపెట్టేది లేదని అధికార పార్టీకి చెందిన పీతల సుజాత ప్రత్యేకంగా నొక్కి వక్కాణించిన తరుణంలో.. తిమింగలాల గురించి ఆల్రెడీ చిన్న చేపలు పోలీసులకు సమాచారం ఇచ్చేశాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అసహనాన్ని అమాంతం పెంచేసేలాగా,  ఆయన భార్య వైఎస్ భారతిపై పోలీసు కేసు నమోదు కాబోతోందా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు షురూ అయిన తర్వాత.. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వారంలో 120 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారని రకరకాల ఆరోపణలు గుప్పించారు. ఇవన్నీ ఒక ఎత్తు.. పులివెందులనుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచిపెట్టిన వర్రా రవీందర్ రెడ్డి గురించి ప్రత్యేకమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పోలీసులు వేధిస్తున్నారని అన్నారు. అన్నింటినీ మించి.. వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు విడుదల చేయడం కోసం తన భార్య భారతి పోలీసులకు ఫోను చేసిందని ప్రచారం చేస్తున్నారని జగన్ ఆవేదన వెలిబుచ్చడం విశేషం. తన భార్య పేరు ఆ రకంగా వార్తల్లోకి రావడాన్ని కూడా జగన్ సహించలేకపోయారు. అదే వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం కారణంగా.. తన భార్య పేరు నిందితురాలిగా కేసులోకే వస్తే.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఎంతా ఉడికిపోతారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

వర్రా రవీందర్ రెడ్డి స్వయంగా వైఎస్ భారతికి పీఏ. ఆమెకు అత్యంత సన్నిహితమైన, విశ్వసనీయమైన అనుచరుడు. బంటు! భారతి కళ్లలో  ఆనందం కోసం ఎవ్వరిమీదనైనా బూతులతో చెలరేగిపోతూ పోస్టులు పెట్టడంలో మొనగాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మీద కూడా అసహ్యమైన పోస్టులు పెట్టిన ప్రబుద్ధుడు.  వర్రా మీద షర్మిల కూడా పో లీసులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. అలాంటి వర్రా రవీందర్ రెడ్డి  ఒకసారి పోలీసులకు చిక్కినట్టే  చిక్కి తప్పించుకుపోయిన తర్వాత.. మళ్లీ దొరికారు. ఇప్పుడు ఆయన పోలీసు విచారణలో ఏం చెబుతారనేది కీలకం.

ఇదంతా కూడా భారతి కోసమే చేసినట్టుగానీ, వైఎస్ భారతి సూచనల మేరకే చేసినట్టుగానీ వర్రా రవీందర్ రెడ్డి చెప్పారంటే.. వైఎస్ భారతి మీద కూడా కేసు నమోదు అవుతుంది. ఆమె పోలీసులకు ఫోను చేసి బెదిరించినట్టు వార్తలు వస్తేనే తట్టుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి.. తన భార్య నిందితురాలిగా మారి.. పోలీసు విచారణకు హాజరుకావాల్సి వస్తే ఏమైపోతారో కదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles